చర్చ:చీరాల: కూర్పుల మధ్య తేడాలు

చీరాల పేరు వెనక చరిత్ర
(తేడా లేదు)

07:05, 8 అక్టోబరు 2014 నాటి కూర్పు

ఈ ఊరి పేరుకు సీతాచీరకు ఏం సంబంధం ఉందని చెప్పడానికి ఆధారాలేమీ లేవు. చేనేత పరిశ్రమకు ఆలవాలమైన ఈ ఊరు పేరు చీర + ఆల = చీరాల అని చెప్పుకోవడం సులభమే కాదు, శాస్త్రీయం కూడాను.

-ఆల అన్న ప్రత్యయంతో తెలుగుదేశంలో ఉన్న ఊరిపేర్లు కోకొల్లలు: జగిత్యాల, మల్యాల, నంద్యాల, చీరాల, పేరాల, కొడిమ్యాల, పరకాల, పరిటాల, పెండ్యాల, పొన్నాల, మామిడాల, కనగాల, ఓగిరాల, కానాల, గుండాల, చిక్కాల, వావిలాల, ఇటిక్యాల, లింగాల మొ॥ కొన్నిఉదాహరణలు.

నేల శబ్దానికి మూలద్రావిడ ధాతువు -*ఞాల (ñāla). ఈ -ఞాల శబ్దమే -యాల శబ్దంగానూ (నంద్యాల, పెండ్యాల మొదలైన వాటిలో) -ఆల శబ్దంగాను ఊరిపేర్లలో నిలచిపోయిందని నా అభిప్రాయం.

ఇక పేరాల అంటే, పేర్ + ఆల = ప్రెద్ద (పేర్- అంటే పెద్ద అన్నది మూల ద్రావిడ ధాతువు) ఆల. -- సురేశ్ కొలిచాల.

Return to "చీరాల" page.