కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్: కూర్పుల మధ్య తేడాలు

కొంత విస్తరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్''' స్వాతంత్ర్య సమరయోధుడు, [[హైదరాబాదు]] మాజీ మేయరు, రచయిత, పాత్రికేయడు మరియు విద్యావేత్త. బహుముఖ ప్రజ్ఞాశీలి. ముదిరాజ్ సంఘపు స్థాపకుడు మరియు వ్యవస్థాపక అధ్యక్షుడు.
 
కృష్ణస్వామి, ఆగష్టు 25, 1893న [[కృష్ణాష్టమి]] రోజు<ref>http://mudiraja.com/mudiraju_leaders.html</ref> [[జాల్నా]]లోని ఒక పేద రైతు కుటుంబంలో జన్మించాడు.<ref>[http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/mudiraj-a-multifaceted-personality/article3756500.ece Mudiraj – a multi-faceted personality - The Hindu August 12, 2012]</ref> ఎంతో శ్రమతో చదువుకొని ఉన్నత విద్యాభ్యాసం నిజాం కళాశాలలో సాగించాడు. 1918లో సోషల్ సర్వీస్ కాన్ఫరెన్స్ నిర్వహించాడు. 1926లో [[రావుబహద్దూర్ వెంకట్రామిరెడ్డి]], [[మాడపాటి హనుమంతరావు]], [[పండిట్ నరేంద్రజీలతోనరేంద్రజీ]]లతో కలసి సుల్తాన్ బజార్‌లోబజార్లో గ్రంథాలయ[[శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం]] రజతోత్సవాన్ని నిర్వహించాడు. 1925లో జాంబాగ్ దేవాలయంలో హిందూ ధర్మ పరిషత్ మహాసభను స్థాపించాడు. 1933 నుంచి 25 సంవత్సరాల పాటు హైదరాబాద్ నగర పాలక సంస్థలో చుడీ బజార్ ప్రాంతానికి మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేశాడు. 1940, 1955 లలో డిప్యూటీ మేయర్ (నాయబ్ మీర్ మజ్లిస్) గా, 1957 నుండి 1958 వరకు హైదరాబాదు నాలుగో మేయరుగా సేవలు అందించారు. మేయరుగా ఉన్న కాలంలో హైదరాబాదుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించి నగరంపై చెరగని ముద్రవేశాడు. రచయితగా, సాహితీవేత్తగానే కాకుండా పాత్రికేయుడిగా కూడా ఆయన సేవలందించారు. సామాజిక రుగ్మతలపై అనేక పుస్తకాలు రాశారు.
 
నిరాడంబర జీవితాన్ని గడిపిన కృష్ణస్వామి 1967 డిసెంబర్ 19న మరణించాడు.