అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
సుబ్రహ్మణ్యకవి నాగాభట్ల నరసకవితో నుభయభాషల పఠించెను. చాలావఱకు స్వయంకృషి చేసి సాహిత్యనిష్ణాతుడాయెను. మనుచరిత్రము-ఆముక్తమాల్యద వీరి కభిమానిత గ్రంథములు. జ్యోతిషభాగముకూడ నీయన చక్కగనెఱిగెను. అదికొంత తొలుత జీవనాధారమైనది. క్రమముగా గవిత్వరచనమే ప్రధానవృత్తిగా బెట్టుకొని రాజ దర్శనము చేయుచు సుబ్రహ్మణ్యకవి తనలేవడి నెట్టుకొనుచుండెను. 1853లో మాడుగల్లు సంస్థానాధిపతియగు శ్రీకృష్ణభూపతిపై నీకవి సీసపద్యములశతక మొకటి చెప్పెను. అది "శ్రీకృష్ణభూపతి లలామశతకము." అప్పటికి గవియీ డిరువది రెండేడులు. మాడుగల్లుసంస్థాన పండితులు మనకవి నెన్నో తిప్పలు పెట్టిరట. మంత్రిప్రెగడ సూర్యప్రకాశరాయకవి మున్నగువారు నాడు తత్సంస్థాన విద్వత్కవులు. అక్కడివారు "కుట్రయొనర్చె లేమ తన గుబ్బలయుబ్బు సహింపలేమిచేన్." అను సమస్య నిచ్చి, నిలుచుండగా బూరింపుమనిరి. అది యీకవిచే నిటు పూరింపబడియె.
 
<poem>
వట్రువహారరత్నములు వన్నె నగల్ పులిమీదవచ్చు నా
పుట్ల యటన్నరీతి జిగి బొల్పగు చూచుకలీల జూచుచున్
 
దొట్రిలనేల? కేలగొని గోగులనొక్కుము నాథయంచు దా
గుట్రయొనర్చె లేమ తనగుబ్బలయుబ్బు సహింపలేమిచేన్.
</poem>
 
ఇట్టి పరీక్షల కాగిన సుబ్రహ్మణ్యకవిని మాడుగల్లుఱేడు మెచ్చి యాస్థానకవిగా నర్థించెను. కాని జన్మస్థానమున కాయూరు దూరమగుటచే నంగీకరింపక కవిగారు వార్షికబహూకారము వచ్చునటుల ప్రార్థించెను. 1853 మొదలు 1869 వఱకు నాసంస్థాన వార్షికవిత్తము సుబ్రహ్మణ్యకవి పొందుచుండెను. 1869 లో పీఠికాపుర సంస్థానమున మాసవేతన మేర్పడినది. గంగాధరరామరాయేంద్రు డీకవిప్రతిభ దెలిసికొని సన్మానించెను.
 
1869 లో పీఠికాపుర సంస్థానమున మాసవేతన మేర్పడినది. గంగాధరరామరాయేంద్రు డీకవిప్రతిభ దెలిసికొని సన్మానించెను.
===భద్రా పరిణయము===
"భద్రాపరిణయము" అను ప్రౌఢాంధ్ర ప్రబంధ మా మహారాజున కంకితము గావించెను. ఏత త్కృతిప్రదానవిషయ మీ పద్యము తెలుపును.