అపకేంద్ర యంత్రం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
[[Image:Tabletop centrifuge.jpg|thumb|150px| ప్రయోగశాలలో బల్లపై వాడగలిగే అపకేంద్రయంత్రం. నమూనాను తయారుచేసినవారు Hettich.]]
 
'''అపకేంద్ర యంత్రం''' ([[ఆంగ్లం]]: '''Centrifuge''') అంటే ఇచ్చిన మిశ్రమం నుంచి ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న కణాలను, తక్కువ ద్రవ్యరాశి ఉన్న కణాలను వేరు చేయడానికి ఉపయోగించే ఒక [[యంత్రం]]. [[విద్యుత్ మోటారు]] సహాయంతో అతివేగంగా తన అక్షం చుట్టూ తిరిగే ఒక స్తూపాకార పాత్రలో ఇచ్చిన మిశ్రమాన్ని వేసినపుడు అపకేంద్రబలం వల్ల ఎక్కువ ద్రవ్యరాశి గల కణాలు పాత్ర అంచువైపుకు చేరుకుంటాయి. తక్కువ ద్రవ్యరాశి గల కణాలు పాత్ర మధ్య లోనికి చేరుకుంటాయి. ఈ విధంగా ఎక్కువ ద్రవ్యరాశిగల కణాలుగల పదార్థాన్ని, తక్కువ ద్రవ్యరాశి గల కణాలు కలిగిన పదార్థాలను వేరు చేయవచ్చు.
==పరిచయం==
'''అపకేంద్ర యంత్రం''' (Centrifuge) అంటే ఇచ్చిన మిశ్రమం నుంచి ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న కణాలను, తక్కువ ద్రవ్యరాశి ఉన్న కణాలను వేరు చేయడానికి ఉపయోగించే ఒక [[యంత్రం]]. [[విద్యుత్ మోటారు]] సహాయంతో అతివేగంగా తన అక్షం చుట్టూ తిరిగే ఒక స్తూపాకార పాత్రలో ఇచ్చిన మిశ్రమాన్ని వేసినపుడు అపకేంద్రబలం వల్ల ఎక్కువ ద్రవ్యరాశి గల కణాలు పాత్ర అంచువైపుకు చేరుకుంటాయి. తక్కువ ద్రవ్యరాశి గల కణాలు పాత్ర మధ్య లోనికి చేరుకుంటాయి. ఈ విధంగా ఎక్కువ ద్రవ్యరాశిగల కణాలుగల పదార్థాన్ని, తక్కువ ద్రవ్యరాశి గల కణాలు కలిగిన పదార్థాలను వేరు చేయవచ్చు.
 
==పనిచేయు సూత్రం==
* అపకేంద్రబలం కణం ద్రవ్యరాశిపై ఆధారపడుతుంది. ద్రవ్యరాశి పెరిగితే, అపకేంద్రబలం పెరుగును. ద్రవ్యరాశి తగ్గితే అపకేంద్రబలం తగ్గును. అందువల్ల ద్రవ్యరాశి, అపకేంద్రబలం అనులోమానుపాతంలో ఉంటాయి. ఈ కారణంగా తక్కువ ద్రవ్యరాశి గల కణాల పై అపకేంద్రబలం తగ్గి పాత్ర మధ్యలోనికి చేరుతాయి. ఎక్కువ ద్రవ్యరాశి గల కణాలపై అపకేంరబలం పెరుగుట కారణంగా అవి కేంద్రం నుండి దూరంగా పోతాయి.
*నీరు, బురద మిశ్రమాన్ని తీసుకొని బాగా కలిపి పారదర్శకంగా కన్పించు గాజుపాత్రలో పోసి, అలాగే మరోపాత్రలో నీరుమరియు నూనెలను కలిపి ఈ మశ్రమాన్ని మరో పారదర్శక పాత్రలో పోసి తేర్చుటకై వుంచాలి. కొంత సమయం తరువాత గమనించిన మొదటి గాజుపాత్రలో అడుగుభాగంలో బురద (సాంద్రత ఎక్కువ నీటికన్న), పైన నీరు వుండును.రెండోపాత్రలో అడుగున నీరు (నూనెకన్నసాంద్రత ఎక్కువ) పైన నూనె వుండును. ఇప్పుడు పాత్రలలోని పదార్థములు క్రిందపడవని భావించి, నిలువు ఉహా అక్షమునకు ఇరువైపుల ఈ పాత్రలను నిలువుగా వుంచినట్లు ఊహించినచో, అక్షమునకు దగ్గరగా తక్కువ సాంద్రత ద్రవాలు (మొదటి పాత్రలో నీరు, రెండోవ పాత్రలో నూనె),వలయంకు వ్యతిరేకదిశలో ఎక్కువ సాంద్రత పదార్థం (మొదటిపాత్రలో అడుగున బురద, రెండో పాత్ర అడుగున నీరు) వున్నట్లు అవగాహన అవుతుంది. ఈసూత్రంపైననే అప కేంద్ర యంత్రం పనిచేయును.
"https://te.wikipedia.org/wiki/అపకేంద్ర_యంత్రం" నుండి వెలికితీశారు