ఎ.ఆర్.కృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 2:
 
 
ఎ.ఆర్.కృష్ణ, [[1926]] [[నవంబర్ 13న13]]న [[గుంటూరు]] జిల్లా [[పెరవలి]] గ్రామములో జన్మించాడు. ఈయన విద్యాభ్యాసం [[శ్రీకాకుళం]], [[బెజవాడ]], [[చల్లపల్లి]], [[మచిలీపట్నం]] హైదరాబాదులలో జరిగింది. యల్.యం.ఇ చదువుతున్నపుడే [[హైదరాబాదు విమోచనోద్యమం]]లో పాల్గొన్నాడు. అజ్ఞాతవాసమునుండి బయటకువచ్చి సోషలిస్ట్ పార్టీ కార్యకలాపాలలో పాల్గొన్నాడు. 1948నాటికి రాజకీయ రంగం మీద వ్యామోహం విడనాడి నాటక రంగంలో ప్రవేశించాడు. 1952నాటికి పూర్తిగా నాటక రంగానికి అంకితమై వినూత్నమైన ప్రయోగాలు చేయాలన్న తపన బయలుదేరింది. జీవిక నిమిత్తం రాష్ట్ర విద్యుత్ బోర్డులో సూపర్వైజర్ గా పనిచేసేవాడు. [[యునెస్కో]] ఆంతర్జాతీయ నాటక సంస్థకు అనుబంధసంస్థగా [[కమలాదేవి ఛటోపాధ్యాయ]] భారతీయ నాట్య సంఘాన్ని స్థాపించారు. ఆమె ప్రోద్బలంతో కృష్ణ 1952లో "ఇండియన్ నేషనల్ థియేటర్" నెలకొల్పాడు. 1953లో "దేశం కోసం" నాటక ప్రదర్శన వెల్లువ సృష్టించాడు. 1955లో ఢిలీలో జరిగిన భారతీయ నాట్యసంఘ సమావేశములో ఉపన్యాసమిచ్చి ఆ సంఘపు సంయుక్త కార్యదర్శిగా ఎన్నుకోబడ్డాడు. ఆంధ్ర విశ్వకళా పరిషత్, నాటక కళల విభాగానికి సభ్యునిగా పనిచేశాడు<ref>http://www.andhrauniversity.info/arts/theatrearts/index.html</ref>.
 
 
పంక్తి 12:
తన ఆశయాల సాధనలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్న కృష్ణను భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది.
 
కృష్ణ [[1992]] [[నవంబర్ 10వ10]]వ తేదీ మరణించాడు.
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఎ.ఆర్.కృష్ణ" నుండి వెలికితీశారు