తెలుగు సాహిత్యం - శివకవి యుగము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
ఈ ద్విపదలవలన గద్యపద్యాది ప్రబంధ సంస్కృత భూయిష్టము గానిది జానుదెనుగు అని బోధపడుచున్నది. ఇంతేకాదు; వృషాధిశతకమున జానుదెనుగు స్వభావమిట్టిదని ఈ క్రిది పద్యములో పాల్కూరి చెప్పినాడు.
 
బలుపొడతోలు సీరయును బాపసరుల్ గిలుపారు కన్ను వె
న్నెలతల సేదుకుత్తుకయు నిండిన వేలుపుటేరు వల్గుపూ
సల గల ఱేని లెంకనని జానుదెనుంగున విన్నవించెదన్
వలపు మదిం దలిర్ప బసవా బసవా వృషాధిపా.
 
కావున పాల్కూరికి సోముని మతమున జానుదెనుగు అనగ '''అచ్చ తెలుగు'''అని తెలియవచ్చుచున్నది.