రేసుగుర్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
==కథ==
రాము (శ్యామ్‌), లక్కీ ([[అల్లు అర్జున్]]) అని పిలవబడే లక్ష్మణ్ వరంగల్ ప్రాంతంలో గడిపిన వారి బాల్యంతో ఈ సినిమా కథ మొదలవుతుంది. రాము బుద్ధిమంతుడు, మంచివాడు అయితే లక్కీ ఆకతాయి, అల్లరి చేసే వ్యక్తి. రాము నిబంధనలను పాటిస్తే లక్కీ తన మనసు చెప్పిందే వింటాడు. చిన్నప్పటి నుంచీ వాళ్ళ మధ్య ఉన్న వైరం తగ్గించాలని వాళ్ళ అమ్మ (పవిత్ర లోకేష్) ఎంత ప్రయత్నించినా అది వాళ్ళ వయసుతోపాటు పెరుగుతూనే ఉంటుంది. పెద్దయ్యాక రాము పోలీస్ శాఖలో అసిస్టంట్ కమిషనర్ అయితే అమెరికాకి వెళ్ళాలని తపనపడుతూ లక్కీ ఆవారాగా తన స్నేహితులతో కలిసి తిరుగుతూ ఉంటాడు. ఈలోపు రాము స్నేహితుడు, మరో అసిస్టంట్ కమిషనర్ అయిన రాజు రాజకీయాల్లోకి రావాలని ఆశపడుతున్న రౌడీషీటర్ శివారెడ్డి(రవి కిషన్)ని శాసనసభ సభ్యుడు పదవికి నామినేషన్ వెయ్యడానికి కూడా వీల్లేకుండా శివారెడ్డి చేసిన అన్ని అక్రమఆలకు సంబంధించిన వివరాలు, సాక్ష్యాలు సేకరించి వాటిని బయటపెట్టి శివారెడ్డి అంతు చూడాలనుకుంటాడు. కానీ శివారెడ్డి రాజుని, తన సహచరులనీ బంధించి వారిలో ఒకరైన పార్థు([[రాజీవ్ కనకాల]])ను రాజుని తుపాకితో కాల్చి చంపమంటాడు. లేకపోతే నిన్ను చంపుతానని బెదిరిస్తాడు. నిజాయితీపరుడైన పార్థు రాజుని కాల్చి చంపడానికి తడబడుతున్న సమయంలో శివారెడ్డి మరో వైపున తుపాకితో కాలిస్తే ఆ శబ్దానికీ, అదురుకీ పార్థు ట్రిగర్ నొక్కడం, రాజు చనిపోవడం జరుగుతాయి. రాజు తుపాకి శుభ్రం చేసుకుంటుండగా మిస్ఫయర్ అయ్యి చనిపోయాడని వార్తలు పుట్టిస్తారు. రాజు తండ్రి ([[పరుచూరి వెంకటేశ్వరరావు]]) మాత్రం ఇది నమ్మక తన కొడుకు ఆశయం కోసం పోరాడుతుంటాడు.
 
ఇదిలా ఉండగా లక్కీ స్పందన ([[శ్రుతి హాసన్]]) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. పేరుకు విరుద్ధంగా ఎలాంటి స్పందన ప్రదర్శించకుండా అన్నిటికీ లోపలే స్పందించడం స్పందన తీరు. ఉదాహరణకి హాస్య సన్నివేశాలు చూస్తూ బయటకి రాయిలా ఉన్నా లోపల పగలబడి నవ్వడం, భయం వేస్తే బయటకి ధైర్యంగా, చలనం లేకుండా ఉంటూ లోపల వణికిపోవడం వంటి చర్యలు చేస్తుంటుంది. తన తల్లిదండ్రులది కూడా అదే పద్ధతి. తన తండ్రి ప్రకాశ్ ([[ప్రకాశ్ రాజ్]]) ఒక విజయవంతమైన వ్యాపారవేత్త. సుమారు 500 కోట్ల ఆస్తి ఉన్న తను మనిషి తనను తాను అన్నివేళలా, అన్నిటిలో నిగ్రహించుకుంటే ప్రపంచాన్ని గెలుచుకుంటాడు అనే సూత్రాన్ని నమ్మి ప్రతీ చిన్న విషయంలో తన కుటుంబం, పనివాళ్ళు మొత్తం అలాగే ఉండేలా జాగ్రత్తపడతాడు. ఈ ప్రవర్తనా ధోరణి ఏ స్థాయికి చేరుకుంటుందంటే తన తల్లి (ప్రగతి) ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో ఉంటే స్పందన ఏమీ జరగనట్టు అక్కడికి వెళ్తుంది. మెల్లమెల్లగగా స్పందనలో సహజ స్పందనలు కలిగించి తనని మామూలుగా మార్చడమే కాక తన ప్రేమను పొందుతాడు. అయితే లక్కీ ప్రవర్తనను ఏ మాత్రం ఇష్టపడని ప్రకాశ్ నిన్ను రిజెక్ట్ చెయ్యడానికి గల ముఖ్యకారణం నీ అన్నయ్య రాము నీ గురించి ఫోన్ చేసి తప్పుగా చెప్పడం అని చెప్తాడు. ఇంటికెళ్ళి రాముతో గొడవపడుతుంటే వాళ్ళ అమ్మ లక్కీపై చెయ్యి చేసుకుంటుంది. తన తల్లి తనని మొదటిసారి కొట్టడం, అదీ రాము వల్ల కొట్టడం లక్కీని రాము ఉద్యోగం పోగొట్టాలని నిర్ణయించుకునేలా చేస్తాయి. శివారెడ్డి ఎన్నికలకి నామినేషన్ వెయ్యడానికి వెళ్తున్న రోజు రాజు తండ్రి సాక్ష్యాలను రాముకి అప్పగిస్తాడు. అవి తీసుకుని కలెక్టర్ ఆఫీసుకు వెళ్తున్న విషయం శివారెడ్డికి తెలిసి తన మనుషులకు ఫోన్ చేసి రాముని చంపెయ్యమంటాడు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర లక్కీ తన స్నేహితులతో కలిసి రాము వెళ్తున్న కారును దొంగిలిస్తారు. ఎత్తుకెళ్ళింది ఎవరో రాముకి తెలియదు. దారిలో ముగ్గురూ దిగిపోగా లక్కీ ముందుకెళ్తాడు. ఈ లోపు లక్కీ వెళ్తున్న కారుని శివారెడ్డి మనుషులు లారీలతో గుద్దుతారు. లక్కీ గాయాలతో బయటపడగా కారు, అందులోని సాక్ష్యాలు తగలబడిపోతాయి. బయటపడ్డ లక్కీ శివారెడ్డి మనుషులని కొట్టాక వాళ్ళు రాముని చంపాలనుకున్నారని తెలుసుకుంటాడు.
"https://te.wikipedia.org/wiki/రేసుగుర్రం" నుండి వెలికితీశారు