కోణార్క సూర్య దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 86:
 
==మతభేదము==
ముఖ్యమైన విషయమేమనగా- ఈకోణార్కము బౌద్ధావశేషమా, కాదా? ఈ విషయంలో చాలా మంది చారిత్రుకులు తర్కించి తర్కించి ఎన్నో గ్రంధాలు వ్రాసారు. ఈచోటనే [[హ్యూయంసాంగ్]] యొక్క చెలితోలా లేకా చిత్రోత్పలా అనే బౌద్ధమత కేంద్రమొకటి ఉండేది. బౌద్ధయుంగంలో కళింగ రాజధాని '''దంతపురము''' ఈ చిత్రోత్పల పేరేనంటారు. హిందువులూ, బౌద్ధులూ గొప్ప స్నేహ భావంతో కలసిమెలసి ఉండెవారని హ్యూయంసాంగ్ చెప్పుతాడు. కోణార్కుకి మైత్రేయవనమని పద్మపురాణంలో వ్రాసివున్నది. బుద్ధదేవుని మారుపేరు మైత్రేయుడని, [[పాళీ]] భాషలో మైత్రేయుడని ఆక్షేత్రానికి అందుకోసమే మైత్రేయవనమని పేరువచ్చిందటారు. కోణార్కములో '''అర్కవటము (జిల్లేడు చెట్టు)''' ఉండేది. దానిక్రింద వటేశ్వరుడు కూడా నేటివరకు పూజింపబడుచున్నాడు. కపిలసంహితను బట్టి ఆచెట్టు క్రింద సూర్యభగవానుడె జపించాడని ప్రమాణం ఉంది. ఆస్థలాన్ని కొందరు బుద్ధిని బోధిద్రుమముండే దంటారు. ఆచెట్టు క్రిందనే బుద్ధదేవుడు 49 రోజులు తప్పస్సు చేసేడంటారు. కొందరు [[అమరకోశం]] బట్టి బుద్ధుని మారుపేరు అర్కబధువని, దేవుని పేరును బట్టి స్థలం పేరు కోణార్కమైదని అంటారు. నరసింహదేవుని తామ్ర శాసనంలో ఈ స్థలానికి '''కోణా కోణా''' లేదా '''కోణాకమనము''' అని పేరుంది. బుద్ధదేవుని మరొకపేరు కోణాకమనీ, అందువల్లనే కోణార్కము బుద్ధదేవుని నామాంతరమగు స్థలమనీ అందురు. కోణార్కుకు అర్ధమేమంటే '''కోణ + అర్క = కోణార్క '''. పూరీక్షేత్రానికి (North-East) ఈశాన్య కోణంలోని అర్కదేవుని క్షేత్రం గనుక దీనికి కోణార్కమని పేరు. ఇలా చాలా విషయాల్లో కోణర్కమునకు బౌద్ధులకు సంబంధమును కలదు.
 
==నిర్మాణకౌశలము==