శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
బొమ్మ చేర్పు
పంక్తి 2:
 
ఈ గ్రంథాలయం [[సెప్టెంబర్ 1]], [[1901]] సంవత్సరంలో ([[ప్లవ]] నామ సంవత్సరం [[శ్రావణ బహుళ తదియ]] ఆదివారం) [[హైదరాబాదు]]లోని రామ కోటి ప్రాంతంలో స్థాపించబడినది. ఇది [[తెలంగాణా]] ప్రాంతంలో మొదటి [[గ్రంథాలయం]]. దీని స్థాపనతో ప్రారంభమైన నిజాం రాష్ట్ర ఆంధ్రోద్యమం తెలంగాణా ప్రజలలో చైతన్య కలుగజేసి తెలుగు భాషా సంస్కృతుల పునరుజ్జీవనానికి అపారమైన కృషి జరిపింది. దీని స్థాపనకు విశేషకృషి చేసినవారు [[కొమర్రాజు లక్ష్మణరావు]]. వీరికి ఆర్థిక సహాయం అందిస్తూ ప్రోత్సాహమిచ్చినవారు [[నాయని వేంకట రంగారావు]] మరియు [[రావిచెట్టు రంగారావు]] గార్లు. అప్పటి పాల్వంచ రాజాగారైన శ్రీ పార్థసారధి అప్పారావు గారు స్థాపన సభకు అధ్యక్షత వహించారు. ఆనాటి సభను అలంకరించిన పెద్దలలో మునగాల రాజా శ్రీ నాయని వెంకట రంగారావు, శ్రీ రఘుపతి వెంకటరత్నం నాయుడు, డా. ఎం.జి. నాయుడు, ఆదిపూడి సోమనాథరావు, శ్రీ మైలవరపు నరసింహ శాస్త్రి, శ్రీ రావిచెట్టు రంగారావు, శ్రీ ఆది వీరభద్రరావు, శ్రీ కొఠారు వెంకట్రావు నాయుడు పేర్కొనదగినవారు.
 
[[File:Sri Krishna Devaraya Andhra Bhasha Nilayam-Hydarabad-1 (1).jpg|thumb|ఇది తెలంగాణాలో అతి పురాతన గ్రంధాలయం, This is oldest library of Telangana State]]
 
ఈ సంస్థ ప్రథమ గౌరవ కార్యదర్శి శ్రీ రావిచెట్టు రంగారావు. వీరు 1910లో స్వర్గస్థులు కాగా, వీరి స్థానంలో [[కర్పూరం పార్థసారధి నాయుడు]] కార్యదర్శిగా గ్రంథాలయానికి స్వంత భవనం నిర్మించాలని సంకల్పించారు. శ్రీ రంగారావు గారి సతీమణి శ్రీమతి రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ గారు భాషా నిలయానికి అవసరమైన ఇల్లు కొనడానికి 3,000 రూపాయలు విరాళం ప్రకటించారు. దానితో ఇప్పుడు సుల్తాన్ బజార్ లో భాషా నిలయం భవనం ఉన్న చోటనే 1910లో ఒక పెంకుటిల్లు కొని, కొన్ని మార్పులు చేసి అందులో గ్రంథాలయం నెలకొల్పడం జరిగింది.
Line 11 ⟶ 13:
 
భాషా నిలయం స్థాపన జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో [[రజతోత్సవాలు|రజతోత్సవాలను]] 1927 ఫిబ్రవరి 16, 17, 18 తేదీలలో [[కావ్యకంఠ గణపతి శాస్త్రి]] గారి అధ్యక్షతన జరిగాయి. అప్పటి గౌరవ కార్యదర్శి శ్రీ [[బూర్గుల రామకృష్ణారావు]] ప్రధాన పాత్ర పోషించి రజతోత్సవ సంచిక ప్రచురించారు.
 
[[File:Sri Krishna Devaraya Andhra Bhasha Nilayam-Hydarabad-1 (2).jpg|thumb|ఇది తెలంగాణాలో అతి పురాతన గ్రంధాలయం, This is oldest library of Telangana State]]
 
దీని [[స్వర్ణోత్సవాలు]] 1952 సెప్టెంబరు 1వ తేదీనుండి మూడు రోజులపాటు వైభవంగా జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారు అధ్యక్షత వహించారు. అప్పటి ఆంధ్ర ప్రభుత్వ ఆస్థానకవి [[శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి]] గారు ప్రారంభోత్సవం చేశారు. ఉత్సవాలలో భాగంగా ఆనాటి తెలంగాణలోని 114 గ్రంథాలయాల ప్రతినిధుల సమావేశం, స్త్రీల సభ, వైజ్ఞానిక సభ, సాహిత్య సభ, కవి సమ్మేళనం వంటి కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా స్వర్ణోత్సవ సంచికను ప్రచురించారు.