మానస సరోవరం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
 
== సాంస్కృతిక ప్రాధాన్యం ==
సంస్కృతములో మానస అనగా మనసు, సరోవరము అనగా సరస్సు. పూర్వ కాలములో [[భారత దేశం]], టిబెట్, [[నేపాల్]] సరిహద్దులతో నిమిత్తం లేకుండా కలిసియుండేవి. అందువలన మానసరోవరము భారతీయులకు, నేపాలీలులకు, టిబిటియన్లకు పవిత్ర స్థలమైయున్నది., అనగా హిందువులకు, బౌద్ధులకు, జైనులకు మనసరోవరం పవిత్రమైన సరస్సు. హిందూ పురాణాల ప్రకారం [[బ్రహ్మ]] దేవుడి ఆలోచననుండి మానసరోవరం ఆవిర్భవించి భూమ్మీద పడినది. మానసరోవరంలోని నీరు త్రాగితే మరణించిన తర్వాత నరకానికి వెళ్ళకుండా నేరుగా కైలాసానికి చేరవచ్చని, సరస్సులో స్నానమాడితే నూరు జన్మల వరకూ పాపాలు పరిహారమైపోతాయని , జ్ఞానానికి మరియు అందానికి ప్రతిరూపాలైన [[హంస]]లు (Swans) మనసరోవరములో విహరించేవని హిందువులు నమ్ముతారు.బ్రహ్మ దేవుడు మానసాన ఊహించి భూమిపై ఆవిష్కరించినది కనుక ఇది మానస సరోవరం గా చెపుతారు. ఈ మానస సరోవరం గూర్చి నే తెలుసుకున్న విశేషాలు.
ప్రపంచంలో కెల్లా ఈ సరోవర జలం స్వచ్చమైనది, అత్యుత్తమమైనదిగా ప్రతీక.
స్వచ్చమైన ఈ సరోవరంలో తెల్లని హంసలు అదనపు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
మానస సరోవర పరిధి దాదాపు 90కి,మీ. ఆసియా ఖండంలోని నాలుగు గొప్పనదులు - బ్రహ్మపుత్ర, కర్నలి, ఇండస్, సట్లెజ్ లకి అధారం మానససరోవర జలం.
ఇక అన్నిటికంటే ప్రత్యేకత వేదమాత విహరించే స్థలం మానససరోవర తీరం.
వేదాలు అభ్యసించి, శాస్త్రాలు ఆచరించలేక పోయినా ఈ సరోవర జలం తీర్థంలా సేవించి, సరోవరంలో స్నానం చేస్తే జన్మధన్యం అనేది నమ్మకం.
 
==యాత్రలు==
చలికాలము లో సరస్సు ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఫలితంగా అక్కడి వాతావరణం యాత్రీకులకు ప్రతికూలంగా ఉంటుంది కనుక యాత్రీకులు (Tourists) సాధారణంగా ఎండాకాలంలోను, ఋతుపవనాల కాలంలోను మనసరోవరాన్ని దర్శిస్తారు. భారత దేశంలో ఉత్తర కాశి నుండి మరియు నేపాల్ లో ఖట్మండు నగరం నుండి ప్రతి సంవత్సరము కైలాస మానసరోవర యాత్రలు జరుగుచున్నవి.వేద, పురాణ ఇతిహాసాల ప్రమాణికంగా కైలాసగిరి-హిమాలయాలు భరత ఖండానికి చెందినవి, 7వ శతాబ్ధం టిబెట్ స్వతంత్ర దేశంగా పాలన మొదలు పెట్టినప్పడి నుండీ ఈ కైలాసగిరి టిబెట్ దేశానికి చెందినది. అందువల్ల హిందువులకే కాక బౌద్ధ, జైనులకి కూడా ఇది ఎంతో పవిత్రమైన పుణ్యస్థలము.
1950 చైనా టిబెట్ ని ఆక్రమించుకున్నాక, భారతీయులకి కైలాస సందర్శనం కష్ట సాధ్యమయ్యింది. 1959 నుండీ 1978 వరకు దాపు 20 సంవత్సరాలు అసలు ఎవరికీ ఈ గిరిని దర్శించడానికి అనుమతి ఇవ్వలేదు.ఆతరువాత 1980 నుండీ కొద్దికొద్దిగా యాత్రికులని భారత ప్రభుత్వం ద్వారా వెళితే అనుమతించేవారట. ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా పలు ట్రావెల్ ఏజెంట్స్ ఈ యాత్రని కొంత సుగమం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
 
యాత్ర జాగ్రత్తలు
 
"https://te.wikipedia.org/wiki/మానస_సరోవరం" నుండి వెలికితీశారు