పూజ (2014 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

2,668 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
కథ జతచేసాను
(తారాగణం జతచేసాను)
(కథ జతచేసాను)
 
[[యువన్ శంకర్ రాజా]] సంగీతం అందించగా ప్రియన్ ఛాయాగ్రహణం; వి. టి. విజయన్ - జై కూర్పునందించారు. [[దీపావళి]] సందర్భంగా ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 22, 2014న విడుదలయ్యింది.
 
==కథ==
ఈ సినిమా కథ బొబ్బిలి ప్రాంతంలో మొదలవుతుంది. చిన్నప్పుడే బొబ్బిలి నుంచి పారిపోయి బీహార్ లో గుండాగా దందాలు చేసి మళ్ళీ బొబ్బిలి తిరిగి వచ్చిన సింగన్న పాత్రుడు (ముఖేష్ అద్వానీ) బొబ్బిలిలో అన్నం ఫైనాన్స్ కంపెనీని పెట్టి దాని ముసుగులో కాంట్రాక్ట్ మర్డర్స్ చేస్తుంటాడు. అదే ఊరిలో ఓ మార్కెట్ యార్డులో వాసు(విశాల్) వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అనుకోకుండా కలిసిన దివ్య([[శ్రుతి హాసన్]])తో వాసు ప్రేమలో పడతాడు. ఇదిలా ఉండగా విశాఖపట్నానికి వచ్చిన ఎస్.పి శివరాం నాయక్(సత్యరాజ్)ని సింగన్న చంపడానికి ప్లాన్ చేస్తాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న వాసు శివరాం నాయక్ ని కాపాడతాడు.
 
అదే సమయంలో ఓ కారణంగా సింగన్న బొబ్బిలి ప్రాంతానికి చెందిన గికే గ్రూప్ కంపెనీ యజమానులైన ఒక కుటుంబాన్ని టార్గెట్ చేస్తారు. కానీ అదే కుటుంబానికి చెందిన వాసు తనవాళ్ళు ఆపదలో ఉన్నారని తెలియడంతో రంగంలోకి దిగుతాడు. ఏ కారణం చేత సింగన్న వాసు కుటుంబాన్ని చంపాలనుకుంటాడు ? తనకంటూ ఓ కుటుంబం ఉన్నా వాసు వారందరికీ ఎందుకు దూరంగా ఉన్నాడు ? శివరాంతో చేతులు కలిపిన వాసు తన వైరి కుటుంబానికి చెందినవాడని సింగన్న తెలుసుకున్నాక ఏం చేసాడు ? అనేది మిగిలిన కథ.
 
==తారాగణం==
1,403

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1312401" నుండి వెలికితీశారు