బాలాసోర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 97:
ఇది బెంగాల్ ప్రెసిడెంసీలో భాగంగా ఉంటూ వచ్చింది.
=== సరిహద్దులు ===
[[2011]] గణాంకాలను అనుసరించి జిల్లా వైశాల్యం 3634 చ.కి.మీ. జనసంఖ్య 23,17,419. జిల్లా ఉత్తర సరిహద్దులో [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రంలోని [[మదీనాపూర్]] జిల్లా, తూర్పు సరిహద్దులో [[బంగాళాఖాతం]], దక్షిణ సరిహద్దులో [[భద్రక్]] జిల్లా మరియు పశ్చిమ సరిహద్దులో [[మయూర్భంజ్]] మరియు [[కెందుజహర్]] జిల్లాలు ఉన్నాయి. జిల్లా 20.48 నుండి 21.59 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 86.16 to 87.29 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది.
 
=== రాకెట్ స్టేషన్ ===
[[1989]]లో బాలాసోర్ జిల్లాలో ఒరిస్సా రాష్ట్ర తూర్పు తీరంలో 21.18 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 86.36 డిగ్రీల తూర్పు రేఖాంశంలో " సౌండింగ్ రాకెట్స్" స్టేషన్ స్థాపించబడింది. అయినప్పటికీ [[శ్రీహరికోట]] లో లాగా ఇక్కడి నుండి శాటిలైట్లు ప్రయోగించబడడంలేదు. ఈ రాకెట్ స్టేషన్ బాలాసోర్ జిల్లాలోని చాందీపూర్ వద్ద బంగాళాఖాతం సముద్రతీరంలో ఉంది. చాందీపూర్ రాకెట్ స్టేషన్ నుండి అగ్ని, పృధ్వి మరియు త్రిశూల్ వంటి మిస్సైల్స్ పరిశోధన ప్రయోగం జరుగుతున్నాయి.
"https://te.wikipedia.org/wiki/బాలాసోర్_జిల్లా" నుండి వెలికితీశారు