మొదలి నాగభూషణశర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
[[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] లో ఎం.ఏ ఆంగ్ల సాహిత్య పట్టభద్రుడై నాగభూషణ శర్మ, అమెరికాలోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో నాటకదర్శకత్వంలో ఎం.ఎఫ్.ఏ పట్టా పొందాడు. నాటకమే ప్రధానాశంగా పరిశోధన చేసి డాక్టరేటు అందుకున్నాడు. ఆ తరువాత [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] లో ఇంగ్లీషు శాఖ లోను, నాటక శాఖ లోను ఆచార్యుడిగా పనిచేశాడు.
 
విదేశాలలో పర్యటించి, వివిధ నాటక ప్రయోగ రీతుల్ని అధ్యయనం చేసి శిక్షణ పొందాడు. నవల, నాటక సాహిత్యానికి చెందిన అనేక పరిశోధనాత్మక వ్యాసాలు పత్రికల్లో ప్రకటించాడు. విషాదాంతం, జంట పక్షులు, సంభవామి, నరజాతి చరిత్ర, మన్మధుడు మళ్లీ పుట్టాడు, రాజా ఈడిపస్ (అనువాదం), [[ప్రజానాయకుడు ప్రకాశం]] మొదలైన నాటకాలను, అన్వేషణ, అడ్డదారి, ఆగస్టు 15, జననీ జన్మభూమి, రాజదండం మొదలైన నాటికలను రచించాడు. ఈయన దాదాపు 70 నాటకాలు, నాటికలు మరియు రేడియో నాటికలు వ్రాశారు. స్వతంత్ర నాటకాలే కాక అనేక అనువాద నాటకాలు కూడా వ్రాశాడు. ఈయన దర్శకత్వంలో ఇరవైకి పైగా ఆంగ్ల నాటకాలు, అరవైకి పైగా తెలుగు నాటకాలు ఈయన దర్శకత్వంలో ప్రదర్శించబడ్డాయి.
 
ది విజిట్, కింగ్ ఈడిపస్, హయవదన, తుగ్లక్, మృచ్ఛకటిక, వెయిటింగ్ ఫర్ గోడో వంటి గ్రీకు, సంస్కృత, ఆంగ్ల నాటకాలకు దర్శకత్వం వహించి హైదరాబాదు డ్రమటిక్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రదర్శించారు. అడ్డదారి, పెళ్ళికి పది నిమిషాల ముందు, మదనకామరాజు కథ, ప్రజానాయకుడు ప్రకాశం వంటి స్వతంత్ర నాటకాలను, యాంటిగని, మాక్‌బెత్, డాల్స్‌హౌస్, ఎనిమీ ఆఫ్‌ది పీపుల్, ఎంపరర్‌జోన్స్, వెయిటింగ్ ఫర్ గోడో, కాయితం పులి, హయవదన, సాంబశివ ప్రహసనం వంటి గొప్ప పాశ్చాత్య, భారతీయ ప్రముఖ నాటకాలను స్వేచ్చానువాదం చేశారు. ప్రజా నాయకుడు ప్రకాశం నాటకాన్ని దేశవ్యాప్తంగా ప్రదర్శించారు.
 
విషాదాంతం, జంట పక్షులు, సంభవామి, నరజాతి చరిత్ర, మన్మధుడు మళ్లీ పుట్టాడు, రాజా ఈడిపస్ (అనువాదం), [[ప్రజానాయకుడు ప్రకాశం]] మొదలైన నాటకాలను, అన్వేషణ, అడ్డదారి, ఆగస్టు 15, జననీ జన్మభూమి, రాజదండం మొదలైన నాటికలను రచించాడు. ఈయన దాదాపు 70 నాటకాలు, నాటికలు మరియు రేడియో నాటికలు వ్రాశారు. స్వతంత్ర నాటకాలే కాక అనేక అనువాద నాటకాలు కూడా వ్రాశాడు. ఈయన దర్శకత్వంలో ఇరవైకి పైగా ఆంగ్ల నాటకాలు, అరవైకి పైగా తెలుగు నాటకాలు ఈయన దర్శకత్వంలో ప్రదర్శించబడ్డాయి.
 
తెలుగు సాహిత్యం- గాంధీజీ ప్రభావం, నూరేళ్ళ తెలుగునాటకరంగం (సంపాదకులు), లోచన (వ్యాస సంపుటి) వీరి ఇతర రచనలు.
"https://te.wikipedia.org/wiki/మొదలి_నాగభూషణశర్మ" నుండి వెలికితీశారు