"తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయం" కూర్పుల మధ్య తేడాలు

(→‎ఆలయ చరిత్ర: ఆలయ చరిత్రపై వాడుకలో వున్న కథనాల వివరాలు)
== మళ్ళీ దేవాలయం వెలుగులోకి వచ్చిన విధం ==
ఎవరు కట్టించారో, ఎప్పుడు కట్టించారో తెలియక జనసంచారం లేని దట్టమైన అరణ్య ప్రాంతంలో ఈ దేవాలయం ఒంటరిగా ఎన్నాళ్ళుందో, ఎన్నేళ్ళుందో ఎవ్వరికీ తెలియదు. అయితే ఐదువందల ఏళ్ల క్రితం ఆయుర్వేద వైద్యులు బజ్జూరి నాగయ్య మూలికల కోసం ఈ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతుండగా, ఈ గుడి బయట పడినట్లు తెలుస్తుంది. ఈ దేవాలయాన్ని నాగయ్య పాకయాజ్ఞులనే బ్రాహ్మణుని సహాయంతో అభివృద్ధి చేసి ఈ ప్రాంతానికి తీర్థాల అనే నామకరణం చేసినట్లు తెలుస్తుంది. ఈ దేవాలయానికి వచ్చే భక్తులు ఇక్కడే నివాసాలు ఏర్పరచుకోగా, ఇక్కడ ఒక గ్రామం వెలసింది. అప్పటి నుంచి సంగమేశ్వరస్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఈ గుడి విశిష్ట త బయటకు తెలియలేదు.
 
==ఆలయ అభివృద్ధి చర్యలు==
వంద సంవత్సరాల క్రితం ఈ దేవాలయానికి పూజారిగా వున్న రాఘవవర్మ తండ్రి రామయ్య గుడిని అభివృద్ధి చేయడానికి తన వంతు ప్రయత్నాలు చేసారు. ఆయన వారసుడిగా వచ్చిన రాఘవవర్మ చుట్టుప్రక్కల గ్రామాల భక్తుల నుంచి విరాళాలను సేకరించి గుడికి ప్రహరీ గోడ, ధ్వజస్తంభం, యాగశాలను నిర్మించారు. దేవాలయాభివృద్ధికి గతంలో పనిచేసిన రెవెన్యూ, పోలీసు అధికారులు కూడా సహకారం అందించారట. 1961లో ఈ గుడిని ఎండోమెంట్‌ శాఖ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుండి ఈ దేవాలయానికి వచ్చే నిధులు, దాతల విరాళాలతో గుడిని అభివృద్ధి చేశారు. ఈ దేవాలయాని కి 80 ఎకరాలు, పక్కనే ఉన్న వెంకటేశ్వరస్వామికి 40 ఎకరాల మాన్యం ఉంది.
 
==నదులు వివరాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1314591" నుండి వెలికితీశారు