"తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయం" కూర్పుల మధ్య తేడాలు

==ఆలయ అభివృద్ధి చర్యలు==
వంద సంవత్సరాల క్రితం ఈ దేవాలయానికి పూజారిగా వున్న రాఘవవర్మ తండ్రి రామయ్య గుడిని అభివృద్ధి చేయడానికి తన వంతు ప్రయత్నాలు చేసారు. ఆయన వారసుడిగా వచ్చిన రాఘవవర్మ చుట్టుప్రక్కల గ్రామాల భక్తుల నుంచి విరాళాలను సేకరించి గుడికి ప్రహరీ గోడ, ధ్వజస్తంభం, యాగశాలను నిర్మించారు. దేవాలయాభివృద్ధికి గతంలో పనిచేసిన రెవెన్యూ, పోలీసు అధికారులు కూడా సహకారం అందించారట. 1961లో ఈ గుడిని ఎండోమెంట్‌ శాఖ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుండి ఈ దేవాలయానికి వచ్చే నిధులు, దాతల విరాళాలతో గుడిని అభివృద్ధి చేశారు. ఈ దేవాలయాని కి 80 ఎకరాలు, పక్కనే ఉన్న వెంకటేశ్వరస్వామికి 40 ఎకరాల మాన్యం ఉంది.
 
==ఇబ్బందుల్లో అభివృద్ధి==
ఊరికి చాలా దూరంలో వుండటం వల్ల సరైన రక్షణ లేదు. దేవాలయంలో పలుసార్లు దొంగతనాలు జరిగి ఉత్సవ విగ్రహాలు మాయమయ్యాయి. గుడి ఆధీనంలో ఉన్న 120 ఎకరాల మాన్యం భూముల కౌలుదారుల వద్ద నుంచి కౌలు వసూలు చేయడంలో సరైన వ్యవస్థ పటిష్టంగా లేకపోవడం దేవాలయానికి రావలసిన ఆదాయం రావడం లేదనేది మరో సమస్య.
 
==కూడలి జాతరకు మరింత గుర్తింపు రావలసి వుంది==
ప్రతి సంవత్సరం మహా శివరాత్రి సందర్భంగా ఐదురోజుల పాటు ఇక్కడ కూడలి జాతరగా జరుగుతుంది. ఈ జాతరకు సుమారు ఐదు లక్షలకు పైగా భక్తులు హాజరవుతారు. ఈ జాతర ద్వారా సుమారు రూ.ఆరు లక్ష ల వరకు ఆదాయం లభిస్తుంది. ఇంతటి ప్రసి ద్ధి చెందిన కూడలి జాతరను అప్పటి కలెక్టర్‌ గిరిధర్‌ జిల్లా జాతరగా ప్రకటించారు. అయినప్పటికీ ఈ దేవాలయాన్ని 6సీ గ్రేడ్‌ కిందనే గుర్తిస్తున్నారని, ఈ దేవాలయాన్ని 6బీ గ్రేడ్‌ కింద గుర్తించాలని భక్తులు కోరుతున్నారు. ఇప్పుడున్న అర్చకులతో పాటు మరొకరిని కూడా ప్రభుత్వ వారి జీతభత్యాలతోె నియమించాల్సిన అవసరం వుందనేది ప్రధానమైన డిమాండు.
 
కూడలి జాతర వేసవికాలంలో కావడం వల్ల నదులు ఎండిపోయి తీవ్ర నీటి ఇబ్బంది నెలకొని ఉంటుంది. ఆ మూడు నదుల వద్ద నీటినిల్వకు సరిపడా ఆనకట్టలు నిర్మించగలిగితే నీరు నిల్వ ఉంటాయి. అదేవిధంగా స్నానఘట్టం ఇప్పుడు పూర్తిగా రాళ్ళు తేలి వుంది. దానిని శుభ్రపరచి నేలభాగాన్ని చదును చేయించి గుచ్చుకునే రాళ్లను తొలగించినట్లయితే శుభ్రమైన చాలినన్ని నీళ్ళతో స్నానాలు చేయడానికి అనువుగా ఉంటుంది. స్నానఘట్టం కూడా ఆకర్షణీయంగా వున్నట్లయితే మరింత పర్యాటక ఆదాయం సంవత్సరం పొడవునా వచ్చే అవకాశం వుందని విశ్లేషకులు సూచిస్తున్నారు.
 
ఈ ఆలయం చుట్టూ ఉన్న ఇప్పటికే దేవాలయం ఆదీనంలో వున్న భూమిలో మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్మించడం వల్ల భక్తులకు సౌకర్యంగా ఉండటమే కాకుండా ఈ ప్రాంతంలో కావలసిన అవసరాలకోసం వచ్చే వ్యాపారస్తులకు వీలుగా వుండి కొన్ని షాపులు కూడా ఏర్పడే పరిస్థితి వస్తుంది. మంచి ఫలవంతమైన చక్కటి భూమి నీటిసౌకర్యం కూడా అందుబాటులో వుండటం వల్ల దీనిలో చక్కటి పార్కులు నిర్మించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు.
 
==నదులు వివరాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1314608" నుండి వెలికితీశారు