"తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయం" కూర్పుల మధ్య తేడాలు

 
==ఆలయ చరిత్ర==
ఖమ్మం నగరానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం తెలంగాణ జిల్లాల్లోనే ప్రసిద్ధిగాంచింది. ఈ స్వామిని వేడుకుంటే కోర్కెలు తీరుతాయని, దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయని భక్తులు అమితంగా విశ్వసిస్తారు.
 
అత్రి, బృగు, మౌత్గ ల్య మహా రుషులు శివునితో కలిసి వెంకటేశ్వరస్వామి కల్యాణానికి వెళ్లి వస్తూ మార్గమధ్యలో ఈ ప్రాంతంలో కొంత సేపు విశ్రాంతి తీసుకున్నారని, ఈ ప్రాంతంలో మూడు నదులు ప్రవహిస్తుండటం చూసి గంగ, పార్వతీదేవితో శివుడు అక్కడే ఉండేటట్లు ప్రయత్నిస్తుండగా, పార్వతి వారించినా వినకుండా మనమందరం ఈ ప్రాంతంలోనే ఉండాల ని శివుడు రుషులతో చెప్పాడని, దీనికి పార్వతి సంతోషించిన పిదప శివుడు, పార్వతి, గంగలను ఇచ్చటనే ప్రతిష్ఠింప చేయాలని శివుడు రుషులను ఆజ్ఞాపించాడంటారు. ఆ మహారుషులు ఓ దివ్యముహూర్తాన గంగా సమేత స్వామి వారితో పాటు వినాయకున్ని, నందీశ్వరున్ని ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించారు. రుషులు ఈ శివాలయాన్ని గంగా సమేత సంగమేశ్వర స్వామి ఆలయంగా పేరుపెట్టారు. అక్కడ ప్రవహించే నదులైన మౌత్గల్య పేరున మున్నేరు, అత్రి మహర్షి పేరున ఆకేరుగా, బృగు మహర్షి పేరున బుగ్గేరుగా ఇక్కడ నదులు ప్రవహిస్తున్నాయి. కలియుగం మొదలైన తరువాత ఇక్కడ నిర్మించిన దేవాలయం అడవిలో పుట్టలతో నిండిపోవడంతో ఈ దేవాలయం కనబడకుండా పోయిందని ఒక పౌరాణిక కథనం
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1314611" నుండి వెలికితీశారు