"తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయం" కూర్పుల మధ్య తేడాలు

 
ఈ ఆలయం చుట్టూ ఉన్న ఇప్పటికే దేవాలయం ఆదీనంలో వున్న భూమిలో మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్మించడం వల్ల భక్తులకు సౌకర్యంగా ఉండటమే కాకుండా ఈ ప్రాంతంలో కావలసిన అవసరాలకోసం వచ్చే వ్యాపారస్తులకు వీలుగా వుండి కొన్ని షాపులు కూడా ఏర్పడే పరిస్థితి వస్తుంది. మంచి ఫలవంతమైన చక్కటి భూమి నీటిసౌకర్యం కూడా అందుబాటులో వుండటం వల్ల దీనిలో చక్కటి పార్కులు నిర్మించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు.
 
==త్రికూటాలయం==
సంగమేశ్వరాలయంలో ఒక్క గర్భగుడి కాకుండా పక్కపక్కనే వుండే మూడు గర్భగుడులు వుంటాయి. అయితే అందులో రెండు శైవానికి సంభందించి శివలింగాలున్న గుడులైతే మూడవది. వైష్ణవ సంభందమయిన నరసింహాలయం. అయితే నరసింహాలయంలో ప్రధాన విగ్రహం ప్రస్తుతం లేదు. ఆ గర్భగుడిపై మాత్రం శేషసాయి అయిన మహా విష్ణువురూపం ఇప్పటికీ కనిపిస్తుంటుంది.
==సంగమేశ్వర లింగం ప్రత్యేకతలు==
తెల్లటి నునుపైన ప్రత్యేక శిలతో చేసిన సంగమేశ్వరుని లింగాకారం. పానవట్టంలో విడిగా తీసి పెట్టిందుకు అనువుగా వున్నట్లు నిర్మించారు. పాలరాయిలా నునుపైన మెరుపుతో వుండే ఈ శివలింగం చాలా ఆకర్షణీయంగా వుంటుంది.
==ఆలయ ప్రాంగణంలోని విగ్రహాలు==
ఆలయప్రాంగణంలో అత్యంతపురాతనమైనవిగా భావించ బడుతున్న [[లజ్జాగౌరి]] ని పోలిన ఒక శిల్పం కనిపిస్తుంది. అదే విధయం సాదకులు నిర్మించుకున్నట్లుగా అనిపించే వామ దిశను చూస్తున్న హనుమంతుని విగ్రహం కూడా శతాబ్ధాల వెనుకటిదిగా కనిపిస్తుంటుంది.
==దేవాలయం గోడలపై చిత్రాలు==
దేవాలయపు గోడలపై మచ్చావతారాన్ని సూచించేల వున్న ఒక చేపబొమ్మ, ఏనుగులూ, గుర్రాలూ, ద్వారపాలకుల వంటివే కాకుండా సృష్టికార్యం రహస్యాన్ని వివరిస్తున్నట్లున్న కొన్ని శిల్పాలు కూడా వున్నాయి.
 
==నదులు వివరాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1314631" నుండి వెలికితీశారు