తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
==మహర్షుల వివరాలు==
===[[అత్రి]] మహర్షి===
అత్రి మహర్షి [[బ్రహ్మ]] కుమారుడు. సప్తర్షులలో ప్రథముడుఈయన ఒకరు. సప్తర్షులుగా కీర్తించబడే ఏడుగురు రుషులు వీరు 1.అత్రి మహర్షి 2.ఆగస్త్య మహర్షి 3. అంగీరస మహర్షి 4. కశ్యప మహర్షి 5. భృగు మహర్షి 6. వశిష్ట మహర్షి 7. విశ్వామిత్ర మహర్షి వీరిని సప్త ఋషులంటారు. అత్రి మహా మునిని సప్తర్షులలో ప్రథముడుగా భావిస్తారు. ఆయన భార్య మహా పతివ్రతగా పురాణాలలో స్థుతించ బడిన అనసూయ.
 
అత్రి గోత్రం ఆయననుండి ఉద్భవించినదే. వీరికి చాలా మంది పుత్రులున్నారు. వీరిలో సోముడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు ముఖ్యులు. వీరు ముగ్గురూ త్రిమూర్తులు అవతారాలని భావిస్తారు. అత్రి బ్రహ్మమానసపుత్రులలో ఒక్కఁడు. భార్య అనసూయ. ఇతఁడు తన తపోబలముచే త్రిమూర్తుల యంశములందు సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు.