తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 52:
===మౌద్గల్య మహర్షి===
ముద్గలుడు ఇతఁడు నిర్జితవిషయేంద్రియుఁడు అయి ఉంఛవృత్తిని జీవించుచు దేవపితృ పూజనములు ఆచరించుటయందు దుర్వాసాదిమునులను ప్రమోదమగ్న మానసులుగ చేసెను. మఱియు ఇతఁడు దేవలోకమును ఒల్లక కేవలసత్వమును చేకొని నిర్వికల్పము అయిన జ్ఞానయోగమును అవలంభించి తుల్యనిందాస్తుతియును, సమలోష్ఠకాంచనుఁడును అయి పరమసిద్ధిని పొందెను. 2. అజమీఢుని రెండవ కొడుకు అగు నీలుని వంశస్థుఁడు. తండ్రి భర్మ్యాశ్వుఁడు లేక హర్యశ్వుఁడు. కొడుకు దివోదాసుఁడు. కూఁతురు గౌతముని భార్య అగు అహల్య. ఇతఁడు క్షత్రియుఁడు అయినను తపోమహిమచే ఇతని వంశజులు బ్రాహ్మణులు అయిరి. వారే మౌద్గల్య గోత్రులు.
 
పూర్వం నలుడనే రాజు కూతురు ఇంద్రసేన మౌద్గల్య ఋషి ని పెళ్లి చేసుకుంది . కొన్నాళ్ళకి ద్గల్యుడికీ కుష్ఠు వ్యాది పట్టుకుంది . ఆ వ్యాది తో భాగా చితికినట్లయి ముసలి తనం వచ్చిందతనికి . రాను రాను చర్మం , గోర్లు పూడిపోయినాయి . దానికి తోడు పరమ కోపిష్ఠి అతడు . ఇవన్ని సహిస్తూభర్త ను సేవిస్తూ ఉంది ఇంద్రసేన . వండి భర్తకు పెట్టి అతను తిని విడిచిన ఎంగిలి కాస్త తిని లేచేది ఆమె .
ఇలా ఉండగా ఒకనాడు భోజనం లో మౌద్గల్యుని బొటన వ్రేలు విస్థట్లో తెగిపడింది . అసహ్యంచుకోలేదు ఇంద్రసేన . ఆ వేలు తీసి పక్కన పెట్టి రోజులాగే ఉచ్ఛిష్ఠం తినటం మొదలు పెట్టింది . ఆది చూసి మౌద్గల్యుని మనసు కరిగి ఆమెను దగ్గరకు తీసుకొని ” ఏమీ కోరుకుంటావో కోరుకో వరమిస్తాను ” అన్నాడు .
అంతట ‘ ఈ భీభత్స రూపం విడిచి పెట్టు ” అంది . ” ఎన్నాళ్ల నుంచో వాంచతో ఉన్నాను , తపశ్శలివి నువ్వు . అందమైన ఐదు రూపాలు ధరించి నన్ను అనుభవించు ” అంది . ఇంద్రసేన . ఆమె అడిగినంతా చేసాడు మౌద్గల్యుడు . చూస్తుండగానే కుష్ఠు రోగం మాయమైనది . నవయవ్వన ఐదురుపాల తో ఆమెని దగ్గరకు తీసుకున్నాడు మౌద్గల్యుడు . ఎన్నో సంవత్సరాలు ఇద్దరు కామవిలాసాలతో కాలం గడిపారు . తుధకి సంతృప్తి పడి ఆమెని వదిలి వెళ్ళి ఘోరమైన తపస్సు చేశాడు మౌద్గల్యుడు . చివరకు శరీరం విడిచి స్వర్గానికి వెళ్ళి సుఖపడ్డాడు .
 
రావరావణ సంగ్రామంలో మౌద్గల్య మహర్షి శాపం కారణంగా రావణుడి పరాక్రమానికి ప్రతీకగా నిలిచిన మహాశక్తిమంతమైన ఒక మహా ఖడ్గం ఆ సమయంలో నిర్వీర్యమైపోతుందని దానితో రావణుడు నిర్వీర్యుడై రాముని ముందు నిలబడిపోతాడనేది ఒక కథనం.