తిరుపతి లడ్డు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
ఈ లడ్డు తయారీ కోసం ప్రత్యేకమైన పద్దతులను పాటిస్తారు.ఈ ప్రసాదం తయారీ కోసం స్వచ్చమైన శనగ పిండి,పటిక బెల్లం,నెయ్యి,ఎండు ద్రాక్ష,యాలుకలు,జీడీపప్పు,కర్పూరం మొదలైన పదార్ధాలు ఉపయోగిస్తారు.
 
==ప్రసాదం వివిధ కాలాల్లో==
భక్తులకు అందజేసే ప్రసాదాన్ని ‘తిరుప్పొంగం’ అనేవారు. తర్వాత సుఖీయం, అప్పం (క్రీ.శ.1455), వడ (క్రీ.శ.1460), అత్తిరసం (క్రీ.శ.1468), మనోహరపడి (క్రీ.శ.1547) ప్రసాదాలను ప్రవేశపెట్టారు. వీటిలో వడ తప్ప మిగతావేవీ ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం లేదు. దూరప్రాంతాలకు తీసుకెళ్ళేందుకు అనువుగా ఉన్న వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది. అది గుర్తించిన అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారి గా 1803 నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది. నాటి నుంచి లడ్డూకు ముందు రూపమైన బూందీని తీపిప్రసాదంగా విక్రయించడం ప్రారంభమైందని చరిత్ర. ఇలా అనేక విధాలు గా మారుతూ వచ్చిన ప్రసాదాల స్వరూపం చివరకు 1940లో తిరుపతి లడ్డూగా స్థిరపడింది.
 
==లడ్డూలలో రకాలు==
# ఆస్ధానం లడ్డూ - వీటిని ప్రత్యేక వుత్సవాలు సందర్భంగా మాత్రమే తయారుచేస్తారు.ప్రత్యేక అతిధులకు మత్రమే వీటిని అందజేస్తారు.
# కళ్యాణోత్సవ లడ్డూ - దీనిని కళ్యాణోత్సవాల సమయంలో ఉత్సవాల్లో పాల్గోనే భక్తులకు అందజేస్తారు.
# ప్రోక్తం లడ్డూ - వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు అందజేస్తారు.
 
==పోటు(లడ్డూ తయారీ శాల)==
"https://te.wikipedia.org/wiki/తిరుపతి_లడ్డు" నుండి వెలికితీశారు