గండవరం సుబ్బరామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
అనేక ప్రతిష్టాత్మక పరిషత్ నాటకాలకు 77సార్లు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అమెరికాలోని తెలుగు సంస్థ ఆటావారు 1998లో నిర్వహించిన ప్రపంచ నాటక రచన పోటీలకుకూడా న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. సుమారు మూడుసార్లు అమెరికాలో పర్యటించి అక్కడి రంగస్థల విశేషాలను గమనించారు.
 
[[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]] వారు ప్రచురించిన గ్రంథానికి సంగ్రహ సంపాదకులుగా వ్యవహరించి [[నాటక విజ్ఞాన సర్వస్వం]] అనే గ్రంథాన్నినాటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ చేతులమీదుగా ఆవిష్కరింపచేశారు. నాటక రంగానికి వీరుచేసిన అసమాన కృషికి ఎన్నో, ఎనె్నన్నో సత్కారాలు,

== సన్మానాలు, అవార్డులు వీరిని వరించాయి. వాటిలో కొన్ని:==
* ఉత్తమ సాహితీ విమర్శకుడుగా ఆరాధనా జవ్వాది ట్రస్ట్
* లలిత కళాసమితి వారి ఉగాది పురస్కారం
* విశేష నాటక రంగ కృషివలుడుగా నార్ల ఫౌండేషన్‌వారి పురస్కారం
* అభినయ స్టేజ్ అవార్డ్
 
నాటక రచన, పాత్ర పోషణ, విమర్శ, పరిశోధన వీరి ప్రత్యేకతలు. ఆంధ్ర దేశంలోని తెలంగాణా, ఆంధ్రా రాయలసీమ జిల్లాలలోనే కాక రాష్ట్రేతర పరిషత్తుల్లో కూడా నిర్వహించిన ఎన్నో నాటక పోటీలు సుబ్బరామిరెడ్డిగారు న్యాయనిర్ణేతగా లేకుండా నిర్వహింపబడవు అనేది అతిశయోక్తికాదు. సాంఘిక, చారిత్రాత్మక, పౌరాణిక నాటకాలన్ని కూడా అవపోసనపట్టిన సుబ్బరామిరెడ్డిగారి రంగస్థల అనుభవం ఉపయోగించుకోని నాటక సంస్థలు లేవు.
ఇలా అనేక విషయాలలో అసమాన ప్రజ్ఞాపాటవాలున్న సుబ్బరామిరెడ్డిగారు గుర్తింపుకోసం, అవార్డులకోసం ఎప్పుడు వెంపర్లాడలేదు. తను చేస్తున్న పని అంకితభావంతో వౌనంగా చేసుకుపోవడమే ఆయన పని.. అవార్డులు కొనుక్కోవడం, తన ప్రతిభను గుర్తించమని అందరినీ ప్రాధేయపడడం ఆయనకి అలవాటు లేదు. అవసరమూ లేదు.. మల్లెపూల పరిమళాన్ని మూటకట్టి ఏ మూలపెట్టినా తన ఉనికి పరిసరాలకు తెలియకుండా ఉండదు. నిజమైన ప్రతిభ, సామర్థ్యాలు ఎంత దాచినా దాగవు. ఖాళీ డబ్బాకు మోత ఎక్కువే కాని నిండు కుండ ఉపయోగమే వేరు కదా...