మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 37:
'''మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి''' తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా అచ్చ తెలుఁగు సాహిత్యంలో పేరెన్నికగన్న కవులలో ప్రముఖుడు. ఆంధ్ర కల్హణ, కళా ప్రపూర్ణ బిరుదాంకితుడు.ఇతడు [[సిధ్ధార్థి]] నామ సంవత్సరం [[ఫాల్గుణ పౌర్ణమి]]నాటికి సరి అయిన [[1920]], [[మార్చి 5]]వ తేదీన తన మాతామహుడైన ఆకొండి రామ్మూర్తిశాస్త్రి ఇంట్లో ఐలెండు పోలవరం గ్రామంలో జన్మించాడు. ఇతని తల్లి లచ్చమ్మ, తండ్రి సత్యన్నారాయణమూర్తి. ఇతని బాల్యం పల్లిపాలెం గ్రామంలో గడిచింది. మహేంద్రవాడ సుబ్బరాయశాస్త్రి, [[ఓలేటి వెంకటరామశాస్త్రి]]ల వద్ద కావ్య,వ్యాకరణాలు చదివాడు. ఆంధ్ర భాషమీద ఉన్న అపారమైన ఆభిమానంతో
ఆంధ్ర దేశంలో ప్రాచీన కాలం నుండి చారిత్రక ఇతివృత్తంతో కవులు కావ్యాలు వ్రాయడం పరిపాటి. శాస్త్రి ఆంధ్రుల చరిత్రను తొమ్మిది పర్వాలుగా ఉదయ పర్వం నుండి నాయక రాజుల చరిత్ర వరకు వ్రాశారు. ఇది ఇరవయ్యవ శతాబ్దంలో ఉద్భవించిన చారిత్రక పంచకావ్యాలలో ఒకటి. మిగిలినవి పింగళి-కాటూరి కవుల [[సౌందరనందము]], [[దుర్భాక రాజశేఖర శతావధాని]] [[రాణా ప్రతాప సింహచరిత్ర]], శతావధాని [[గడియారం వేంకట శేషశాస్త్రి]] [[శ్రీ శివభారతము]], [[తుమ్మల సీతారామమూర్తి]] [[బాపూజీ ఆత్మకథ]] అనేవి. శాస్త్రి రచించిన ‘‘ఆంధ్ర పురాణము’’ చరిత్ర కావ్యమైనా సాహితీ విలువలు కలిగిన కావ్యం.
''ఆంధ్ర రచయితలు'' శాస్త్రి ప్రసిద్ధ రచనలలో ఒకటి. ఇందులో నీతి చంత్రిక, బాల వ్యాకరణం రచించిన [[చిన్నయసూరి]] నుండి [[తుమ్మల సీతారామమూర్తి చౌదరి]] వరకు నూరుగురి మహా రచయితలను గూర్చి సద్విమర్శతో వ్రాయబడిన గ్రంథం. 2012 డిసెంబరులో ఈ గ్రంథాన్ని శాస్త్రి కుమారులు ''మధునామూర్తి'' సవరణలు చేసి నూతనంగా పదముగ్గురు రచయితలను చేర్చి తిరిగి ముద్రించి తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలలోను, మరల హైదరాబాదులోను ఆ గ్రంథాన్ని ఆవిష్కరింపజేశాడు.
శాస్త్రి రచించి ప్రచురించిన ఖండకావ్యాలు - (1) తోరణములు (2) శ్రీ ఖండములు (3) చైత్రరథం (4) కేళాకుళి అనునవి ఉన్నాయి. శాస్త్రి పిన్ననాటనే అంటే 10 సంవత్సరాల వయస్సులో పద్యాలు వ్రాయడం మొదలుపెట్టారు. 1938లో వారి తొలి ఖండ కావ్యం ‘తోరణము’ వెలువడింది. దానికి [[విశ్వనాథ సత్యనారాయణ]] పీఠిక వ్రాస్తూ శాస్త్రి మహాకవి యయ్యే సూచనలు ఈ పద్యంలో గోచరిస్తున్నాయని ఈ దిగువ పద్యం ఉదాహరించాడు.
పంక్తి 53:
==ఇతర లింకులు==
* [http://www.andhrabhoomi.net/content/sub-feature-9 ఆంధ్ర భూమి లో వ్యాసం]
* చిత్ర సకుటుంబ సచిత్ర మాసపత్రిక నవంబర్ 2014 సంచిక పేజీలు 108-109
[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:తెలుగు రచయితలు]]
|