మసూమా బేగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''మసూమా బేగం''' (జ: 1902) సుప్రసిద్ధ సంఘ సేవకురాలు. కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకురాలు.
 
మసూమా బేగం 1901, అక్టోబరు 7న హైదరాబాదులో విద్యావంతుల కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి ఖదివే జంగ్ బహాదుర్ (మిర్జా కరీంఖాన్), తల్లి తయ్యబా బేగం భారతదేశపు ముస్లిం మహిళలలో తొలి పట్టభద్రురాలు.<ref name=hh_tyaba>{{cite web|title=Tyaba Begum Sahaba Bilgrami|url=http://www.hellohyderabad.com/Hyderabad-History/Biographies/Tyaba-Begum-Sahaba-Bilgrami.aspx|website=HelloHyderabad.com|accessdate=3 November 2014}}</ref> ఈమె మాతామహుడు హైదరాబాదులో రాష్ట్ర కేంద్ర గ్రంథాలయ స్థాపకుడైన సయ్యద్ హుస్సేన్ బిల్‌గ్రామీ ఇమాదుల్ ముల్క్. ఈమె సోదరుడు [[అలీ యావర్ జంగ్]] హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఈమెకు చిన్నతనం నుండి సంఘసేవలో ఆసక్తి ఎక్కువ. మసూమా విద్యాభ్యాసం మహబూబీయా బాలికల పాఠశాలలో జరిగింది. వీరు ఇరవై సంవత్సరాల వయసులో "అంజుమన్-ఏ-ఖవాతీన్" అనే విద్యా ప్రసార సంస్థకు అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 1927లో హైదరాబాదులో ఏర్పడిన అఖిల భారత మహిళా సంస్థ యొక్క ఆంధ్ర శాఖ కార్యదర్శిగా తరువాత అధ్యక్షురాలిగా పనిచేశారు.
 
1922లో ఈమె ఆక్స్‌ఫర్డులో చదివి తిరిగివచ్చిన తన కజిన్ హుసేన్ అలీఖాన్‌ను పెళ్ళి చేసుకొంది.<ref name=srivastava>{{cite book|last1=Srivastava|first1=Gouri|title=The Legend Makers: Some Eminent Muslim Women of India|date=Jan 1, 2003|publisher=Concept Publishing Company|location=New Delhi|isbn=8180690016|pages=90-92|url=http://books.google.com/books?id=ERavqiLTu7cC&pg=PA91&lpg=PA91&dq=Masuma+Begum+anjuman#v=onepage&q=Masuma%20Begum%20anjuman&f=false|accessdate=3 November 2014}}</ref> ఈమె భర్త డాక్టర్ హుసేన్ ఆలీ ఖాన్ ఆ తరువాత కాలంలో [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో ఆంగ్ల శాఖాధిపతిగా పనిచేశారు. వీరికి ఐదుగురు సంతానం (నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి) - అలీఖాన్, అనీస్ హస్నైన్, మీర్జా ఆసిఫ్ అలీఖాన్, నాసిర్ అలీఖాన్, రషీద్ అజర్ అలీఖాన్
 
ఈమె 1952లో షాలిబండ నియోజకవర్గం నుండి, 1957లో పత్తర్ ఘట్టీ నియోజకవర్గం నుండి శాసన సభకు ఎన్నికయ్యారు. ఈమె [[నీలం సంజీవరెడ్డి]] మంత్రివర్గంలో సాంఘీక సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేసింది.
"https://te.wikipedia.org/wiki/మసూమా_బేగం" నుండి వెలికితీశారు