ఆవుల గోపాల కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

తొలగించిన పేరాలో AGKతో ఎవరికి సన్నిహిత సంబందం వుందో తెలియటం లేదు. అందువల్ల తొలిగించటమైనది.
కొత్త పేజీ: గుంటూరు జిల్లా తెనాలి తాలూకా మూల్పూరు గ్రామంలో సామాన్య మధ్య...
పంక్తి 1:
గుంటూరు జిల్లా తెనాలి తాలూకా మూల్పూరు గ్రామంలో సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో కనిష్టుడుగా ఏప్రియల్ 29-1917లో జననం. ఉన్నత పాఠశాలా విద్యాభ్యాసం తురుమెళ్ళలో. ఆనాడే విద్యార్థులలో వేరుగా మసిలాడు. ప్రైవేటుగా తెలుగు చదువుకున్నాడు. అప్పుడే 'కృష్ణశతకం' వ్రాసాడని వినికిడి. కళాశాల విద్యాభ్యాసానికి గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో చేరినప్పటినుండి ప్రతిభావ్యుత్పత్తులు విప్పార నారంభించినవి. స్వగ్రామంలో జి.బి.యస్. సరస్వతీ స్వాములవారితో తాత్త్విక చర్చ ఫలితంగా కలానికి పదునెక్కింది. సెలవుల్లో యింటికి వచ్చి, పురాణ శాస్త్రులకు పోటీగా తానూ మహాభారత ఘట్టాలను పురాణంగా చెప్పాడు. అది విని బ్రహ్మానందభరితులైన తల్లి దిష్టి తీసెయ్యటం యేమంత విశేషంకాదేమో.
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = ఆవుల గోపాలకృష్ణమూర్తి
| residence =
| other_names = ఎ జి కె
| image = Avula gopalakrishna murty.jpg
| imagesize = 200px
| caption = ఆవుల గోపాలకృష్ణమూర్తి
| birth_name = ఆవుల గోపాలకృష్ణమూర్తి
| birth_date = [[ఏప్రిల్ 29]], [[1917]]
| birth_place =
| native_place =
| death_date = [[సెప్టెంబరు 6]], [[1966]]
| death_place =
| death_cause =
| known = ప్రసిద్ధిచెందిన [[హేతువాది]]
| occupation =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| wife =
| spouse=
| partner =
| children =
| father =
| mother =
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
గుంటూరు కళాశాలా జీవితంలో భవిష్యత్తుకు పునాదు లెర్పడ్డయ్. ఇంగర్ సాల్, త్రిపురనేని రామస్వామి రచనలు ఛాందస భావాల్ని ఛేదించటానికి వుపకరించగా, ఆ ప్రోత్సాహం మున్ముందుకు నడిపించింది. పట్టణ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడుగా ఎన్నుకోబడటం అందులో భాగమే. అప్పుడే కర్ణాకర్ణిగా ఎం.ఎన్.రాయ్ ని గురించి విని, తెలుసుకోవాలనే జిజ్ఞాసలోవుండగా, ఒకానొక కమ్యూనిస్టు రాయ్ ని దూషిస్తుంటే, సాచి చెంపపెట్టు పెట్టిన ఉద్రేకి గొపాలకృష్ణమూర్తి. ఆప్తమిత్రుడు ఎలవర్తి రోసయ్య చాదస్తాన్ని వదలించ దీక్షబూని, త్రిపురనేని
[[ఎ.జి.కె.]] గా ప్రసిద్ధిచెందిన [[హేతువాది]] '''ఆవుల గోపాలకృష్ణమూర్తి'''. వీరు [[ఏప్రిల్ 29]], [[1917]] న జన్మించారు. [[సూత పురాణం]] లోని పద్యాలన్నీ కంఠతా పట్టాడు. [[ఆవుల సాంబశివరావు]] పై ఈయన ప్రభావం ఉంది. [[రాడికల్ హ్యూమనిస్టు ]], [[సమీక్ష]] పత్రికలు నడిపారు. 1952 తెనాలి లో ఈయన జరిపిన హ్యూమనిస్టు సభకు [[ఎం.ఎన్.రాయ్]] ప్రారంభోపన్యాసాన్ని పంపారు. 1964లో అమెరికా ప్రభుత్వం ఈయన్ని ఆహ్వానించింది. [[వివేకానంద]] పై ఈయన చేసిన విమర్శల ధృష్ట్యా ఈయన్ని అమెరికా వెళ్ళనివ్వరాదని [[ఆంధ్రప్రభ]] ఆందోళన చేసింది.
 
సాహిత్యంలో ఔచిత్యం వుండాలనేది ఆవుల గోపాలకృష్ణమూర్తి గట్టి అభిప్రాయం. ఆ దృష్టితోనే విశ్వనాధ సత్యనారాయణ మొదలు ప్రాచీన కవుల వరకూ తన విమర్శకు గురిచేశాడు. కవులు, రచయితలలో ఆవుల అంటే విపరీతాభిమానం గలవారు, తీవ్రంగా భయపడేవారు. రెండు వర్గాలుగా వుండేవారు. భయపడిన వారిలో విశ్వనాథ సత్యనారాయణ ప్రధముడు. ఆవుల వుంటే ఆ సభ కు విశ్వనాథ వచ్చేవాడు కాదు. వేయి పడగలు మొదలు రామాయణ కల్పవృక్షం వరకూ వుతికేసిన ఆవుల అంటే భయపడడం సహజం.
 
1941 ప్రాంతాలలో ఎజికె గాంధీజీ పై తీవ్ర విమర్శలతో కూడిన వ్యాసం ప్రచురిస్తే, ఎం.ఎన్. రాయ్ పక్షాన ఆంధ్రలో రాడికల్ డెమోక్రటిక్ పార్టీ నాయకుడుగా వున్న అబ్బూరి రామకృష్ణరావు అదిరిపడ్డాడు. ఎం.ఎన్. రాయ్ కు ఫిర్యాదు చేశాడు. కాని రాయ్ వ్యాసంలో విషయం తెలిసి ఎజికెని సమర్ధించాడు.
 
ఎ.జి.కె. ఎం.ఎ.ఎల్.ఎల్.బి. చదివి అడ్వొకేట్ గా తెనాలిలో ప్రాక్టీసు చేశారు. తెలుగు, ఇంగ్లీషు సాహిత్యం రంగరించి వడపోసారు. కవులను, సాహితీ పరులను ఎజికె ఎంతగా ఆకర్షించారో చెప్పజాలం. ఏ మాత్రం పలుకు వున్న దన్నా ఎంతో ప్రోత్సహించేవారు. సాహిత్య వ్యాసాలు కొద్దిగానే రాసినా, ఉపన్యాసాలు చాలా చేశారు. కవులను ప్రోత్సహించారు. రాయించారు.
ఎం.ఎన్. రాయ్ అనుచరుడుగా ఎ.జి.కె. ఆంధ్రలో ప్రధాన పాత్ర వహించారు. సొంత ఖర్చులతో పత్రికలు, రాడికల్, రాడికల్ హ్యూమనిస్ట్, నడిపారు. ఇంగ్లీషు పత్రికలకు రాశారు. మానవవాద, హేతువాద ఉద్యమాలు తీవ్రస్థాయిలో నడిపించారు.
ఆవుల గోపాలకృష్ణ మూర్తి నోట్లో అతి సామాన్యమైన పలుకు కూడా మాధుర్యం సంతరించుకుంటుందని మూల్పూరుకు చెందిన (ఎ.జి.కె. గ్రామం) వెనిగళ్ళ వెంకట సుబ్బయ్య అనేవారు.
 
ఎ.జి.కె. పెళ్ళి ఉపన్యాసాలంటే అదొక సాహిత్య వ్యాసం అనవచ్చు. ప్రతి చోట ప్రత్యేక పాయింట్లు చెప్పేవారు.
ఎజికె చేత ఎందరో రచయితలు కవులు పీఠికలు రాయించుకున్నారు.
 
 
వీరు [[సెప్టెంబరు 6]], [[1966]] లో చనిపోయారు.
==సూచికలు==
{{మూలాలజాబితా}}
* http://agk-rationalist.blogspot.in/search/label/AGK
 
[[వర్గం:1917 జననాలు]]
[[వర్గం:1966 మరణాలు]]
[[వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:హేతువాదులు]]