ఆంధ్రా బ్యాంకు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
| homepage = http://www.andhrabank.in
}}
[[File:Andhra bank.svg|కుడి|thumb|250px]]
 
భారత దేశపు [[భారత దేశపు వాణిజ్య బ్యాంకులు|వాణిజ్య బ్యాంకుల]]లో '''ఆంధ్రా బ్యాంకు''' ఒకటి. ఈ బ్యాంకును [[1923]], [[నవంబరు 20]]న ప్రముఖ స్వాతంత్ర సమర యోధుదు, మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన [[భోగరాజు పట్టాభి సీతారామయ్య]] మొట్టమొదట [[మచిలీపట్నం]] లో స్థాపించాడు. [[1980]]లో ఈ బ్యాంకు జాతీయం చేయబదింది. [[1981]]లో [[క్రెడిట్ కార్డు]] లను జారీ చేయుటం ద్వారా భారత దేశానికి క్రెడిట్ కార్దు వ్యవస్థ ను ఈ బ్యాంకు పరిచయం చేసింది. [[2003]] నాటికి నూరు శాతం కంప్యూటరీకరణ సాధించింది. [[2007]]లో బయెమెట్రిక్ ఏటిఎంలను భారతదేశానికి పరిచయం చేసింది. [[సెప్టెంబర్]] [[2007]] నాటికి ఈ బ్యాంకు 1,289 (Rural-396, Semi-urban-376, Urban-338, Metro-179)బ్రాంచీలతో 99 ఎక్స్‌టెంషన్ శాఖలతో, 37 సాటిలయిట్ ఆఫీసులతో,505 ఏటిఎంలతో, 22 రాష్ట్రాలలో, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో విస్తరించి వుంది. పెట్టుబడులను రాబట్టటంలో ఈ బ్యాంకు [[ఆసియా]]లోనే ప్రథమ స్థానంలో ఉంది. భారతదేశం మొత్తంలో ఈ బ్యాంకుకు 1,30,000 షేర్‌హోల్డర్స్, 13.72 మిలియన్ల ఖాతాదారులు ఉన్నారు. ప్రారంభం నుండి నేటి వరకు మొత్తం ఋణాలలోకనీసం 50 శాతానికి తగ్గకుండా ఋణాలను గ్రామీణ భారతానికే అందిస్తున్నబ్యాంక్ ఇది. దేశంలో [[బ్యాంకుల జాతీయీకరణం]] చేసిన తర్వాత క్రమబద్దంగా నడుస్తున్న [[భారత దేశపు జాతీయ బ్యాంకులు|జాతీయ బ్యాంకు]]లలో ఇది ప్రధానమైనది. ఆంధ్రుల అభిమాన బ్యాంక్ ఆంధ్రాబ్యాంక్.
 
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రా_బ్యాంకు" నుండి వెలికితీశారు