రామాయణ కల్పవృక్షం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
 
"తెలుగు సాహిత్యంలో రామకథ" అనే పరిశోధనా రచనలో రచయిత్రి పండా శమంతకమణి ఇలా అన్నది. "ఆధునిక సాహిత్యంలో వెలువడిన రామాయణరచనలలో ముందుగా పేర్కొనవలసినది రామాయణ కల్పవృక్షమును. ఇది వాల్మీకిరామాయణానుసారి అయ్యును నూతన కల్పనములు, పాత్రపోషణము, వర్ణనా వైచిత్ర్యములతో స్వతంత్ర కావ్యత్వమును సమకూర్చుకొన్నది. అహల్యాశాప విమోచన ఘట్టము, అశ్వమేధ సమయంలో దశరధుడు గుహుని, విశ్వామిత్రుని ఆహ్వానించుట, శివ ధనుర్భంగము, మారీచ వధ వంటి ఘట్టములలో కథనం వాల్మీకి కథనంనుండి గణనీయంగా మార్చబడింది. వాలి వధ, సీత అగ్ని ప్రవేశం వంటి ధర్మ సందేహాస్పదమనిపించే విషయాలను నూత్నమైన మెళకువలతో కవి తీర్చిదిద్దెను. దుష్టపాత్రల చిత్రణలో కూడ క్రొత్త దనము, ఆధ్యాత్మికత జోడింపబడినవి. అన్నింటికంటె విశిష్టముగా పేర్కొనవలసిన విషయం సన్నివేశాలలోను, సంభాషణలలోను, చర్యలలోను కవి మేళవించిన తెలుగుదనం. .. వాల్మీకి రామాయణమునకు వ్యాఖ్యానప్రాయమైన కావ్యముగా కల్పవృక్షము రూపొందింపబడినది. పరంపరాగతమైన సాహిత్య ప్రక్రియలను, ఆధునిక కాలంలో వచ్చిన భిన్న దృక్పధాలను క్షుణ్ణముగా అర్ధము చేసికొని సహృదయుడైన విమర్శకునిగా విచారణశీలిగా రూపొందిన ప్రభావంతుడైన కవి వెలయించిన కమనీయ కావ్యము రామాయణ కల్పవృక్షము. <ref name="ramakatha">తెలుగు సాహిత్యంలో రామకథ - కుమారి పండా శమంతకమణి (ఆంధ్ర సాహిత్య పరిషత్, హైదరాబాదు ప్రచురణ - 1972) [http://www.archive.org/details/TeluguSahithyamuloRamakatha ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం]</ref>
== కథావిభాగములు ==
రామాయణ కల్పవృక్షములో కథావిభాగాలకు వాల్మీకములాగానే కాండలని పేరుంచారు. బాలకాండము, అయోధ్యాకాండము, అరణ్యకాండము, సుందరకాండము, యుద్ధకాండములనేవి ఆ ప్రాథమిక విభాగాలు.
 
==కథనం==
"https://te.wikipedia.org/wiki/రామాయణ_కల్పవృక్షం" నుండి వెలికితీశారు