రామాయణ కల్పవృక్షం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
రామాయణ కల్పవృక్షములో కథావిభాగాలకు వాల్మీకములాగానే కాండలని పేరుంచారు. బాలకాండము, అయోధ్యాకాండము, అరణ్యకాండము, సుందరకాండము, యుద్ధకాండములనేవి ఆ ప్రాథమిక విభాగాలు. ఆపైన ప్రతి కాండను అనేకమైన ఖండములుగా విభజించారు.
=== బాలకాండము ===
విశ్వనాథ వారి కల్పవృక్షము బాలకాండములోని అవతారిక పద్యాలతో ప్రారంభమవుతుంది. వీటిలో విశ్వనాథ సత్యనారాయణ తనకు రామాయణ వ్రాసేందుకు కలిగిన ప్రేరణ, చేసిన ప్రయత్నం వంటివి చెప్పుకున్నారు. తన వంశము, కావ్యానికి వ్రాయసకానిగా వున్న తమ్ముడు వెంకటేశ్వరరావు వంటి వారి వివరాలతో కూడిన అనేక పద్యాలు కూడా అవతారికలో వుంటాయి. ఆపైన
=== ఇష్టిఖండము ===
మొదటిగా వచ్చే ఖండం పేరు ఇష్టి ఖండము. ఈ ఖండములో దశరథ మహారాజు, ఆయన మువ్వురు భార్యలు, సంతానలేమి, ప్రయత్నాలు, మంత్రుల సలహాతో యాగం చేయుట, యాగఫలంగా యజ్ఞపురుషుడు పాయసపాత్రలివ్వడం వరకూ ఉన్న కథ వస్తుంది. వాల్మీకి రామాయణంలోని మూలకథనం నుంచి కల్పవృక్షములోని ఇష్టిఖండములోని కథనం పలుమార్లు భేదిస్తుంది.
 
==కథనం==
"https://te.wikipedia.org/wiki/రామాయణ_కల్పవృక్షం" నుండి వెలికితీశారు