ఋతు సంహారము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
ఋతు సంహారము కావ్యాన్ని కవిసమ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]] రచించారు. దీనినే తెలుగు ఋతువులు అన్న మరో పేరుతో వ్యవహరిస్తారు. పలు ఋతువులు తెలుగు నాట కలిగించే ప్రకృతి మార్పులు, ప్రజల జీవితాలలోకి తీసుకువచ్చే సున్నితమైన చేర్పులు వంటివాటిని వర్ణిస్తూ రాగరంజితమైన ఈ కావ్యాన్ని ఆయన రచన చేశారు.
== రచన నేపథ్యం ==
విశ్వనాథ సత్యనారాయణ రచించిన ఈ ఋతు సంహార కావ్యానికి మూలకథావస్తువు, కావ్యరచన విషయంలో కాళిదాసు రచించిన '''ఋతు సంహారము''' కావ్యం ప్రభావం ఉంది. ఆ ప్రభావం నేరుగా ఆయన ఎంచుకున్న కావ్యనామంపైనే కనిపిస్తోంది.<ref name="మసన చెన్నప్ప-తెలుగు ఋతువులు">{{cite book|last1=చెన్నప్ప|first1=మసన|title=విశ్వనాథ సాహితీ సమాలోచనం (తెలుగు ఋతువులు)|date=సెప్టెంబరు 3, 1995|publisher=యువభారతి|location=హైదరాబాద్|edition=ప్రథమ ముద్రణ|accessdate=18 November 2014}}</ref> కానీ విశ్వనాథ సత్యనారాయణ రచనలోని వర్ణనలపై మాత్రము ఆ ప్రభావమేమీలేదు సరికదా ఆయన చిన్నతనంలో చూచిన తెలుగు వాతావరణం వర్ణనలే వున్నాయి. ఈ కావ్యాన్ని నిజజీవితంలో విశ్వనాథ సత్యనారాయణ తన చిన్నతనంలో చూసిన పల్లెజీవితంలోని తెలుగు ఋతువులనే వర్ణించానని తెలిపారు<ref name="విశ్వనాథలోని నేను">{{cite book|last1=భరతశర్మ|first1=పేరాల|title=విశ్వనాథ శారద (విశ్వనాథలోని నేను వ్యాసం)|date=సెప్టెంబరు, 1982|publisher=విశ్వనాథ స్మారక సమితి|location=హైదరాబాదు|accessdate=13 November 2014}}</ref>.
== మూలాలు ==
 
<references/>
[[వర్గం:విశ్వనాథ సత్యనారాయణ రచనలు]]
[[వర్గం:తెలుగు కావ్యములు]]
"https://te.wikipedia.org/wiki/ఋతు_సంహారము" నుండి వెలికితీశారు