ఋతు సంహారము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
విశ్వనాథ సత్యనారాయణ రచించిన ఈ ఋతు సంహార కావ్యానికి మూలకథావస్తువు, కావ్యరచన విషయంలో కాళిదాసు రచించిన '''ఋతు సంహారము''' కావ్యం ప్రభావం ఉంది. ఆ ప్రభావం నేరుగా ఆయన ఎంచుకున్న కావ్యనామంపైనే కనిపిస్తోంది.<ref name="మసన చెన్నప్ప-తెలుగు ఋతువులు">{{cite book|last1=చెన్నప్ప|first1=మసన|title=విశ్వనాథ సాహితీ సమాలోచనం (తెలుగు ఋతువులు)|date=సెప్టెంబరు 3, 1995|publisher=యువభారతి|location=హైదరాబాద్|edition=ప్రథమ ముద్రణ}}</ref> కానీ విశ్వనాథ సత్యనారాయణ రచనలోని వర్ణనలపై మాత్రము ఆ ప్రభావమేమీలేదు సరికదా ఆయన చిన్నతనంలో చూచిన తెలుగు వాతావరణం వర్ణనలే వున్నాయి. ఈ కావ్యాన్ని నిజజీవితంలో విశ్వనాథ సత్యనారాయణ తన చిన్నతనంలో చూసిన పల్లెజీవితంలోని తెలుగు ఋతువులనే వర్ణించానని తెలిపారు<ref name="విశ్వనాథలోని నేను">{{cite book|last1=భరతశర్మ|first1=పేరాల|title=విశ్వనాథ శారద (విశ్వనాథలోని నేను వ్యాసం)|date=సెప్టెంబరు, 1982|publisher=విశ్వనాథ స్మారక సమితి|location=హైదరాబాదు}}</ref>.
== కథావస్తువు ==
తెలుగు ఋతువులు కావ్యానికి కథావస్తువు తెలుగు నాట వసంత, గ్రీష్మాది ఋతువులు ఎలా ప్రవర్తిల్లుతాయి, వాటి వల్ల ప్రజాజీవితంలో సూక్ష్మమైన భేదాలు ఎలా వాటిల్లుతాయి, ఆచార వ్యవహారాలు ఎలా వుంటవి మొదలైన విషయాలతో కూడివుంటుంది. ఇది వర్ణన ప్రధానమైన కావ్యము. కేవల ఋతువర్ణనలకే పరిమితం కాకుండా ప్రత్యేకించి తెలుగు నాట ఆయా ఋతువులు ఎలా వుంటాయన్నది రచించడం వల్ల ఈ కావ్యానికొక ప్రత్యేకత ఏర్పడింది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఋతు_సంహారము" నుండి వెలికితీశారు