ఋతు సంహారము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
== కథావస్తువు ==
తెలుగు ఋతువులు కావ్యానికి కథావస్తువు తెలుగు నాట వసంత, గ్రీష్మాది ఋతువులు ఎలా ప్రవర్తిల్లుతాయి, వాటి వల్ల ప్రజాజీవితంలో సూక్ష్మమైన భేదాలు ఎలా వాటిల్లుతాయి, ఆచార వ్యవహారాలు ఎలా వుంటవి మొదలైన విషయాలతో కూడివుంటుంది. ఇది వర్ణన ప్రధానమైన కావ్యము. కేవల ఋతువర్ణనలకే పరిమితం కాకుండా ప్రత్యేకించి తెలుగు నాట ఆయా ఋతువులు ఎలా వుంటాయన్నది రచించడం వల్ల ఈ కావ్యానికొక ప్రత్యేకత ఏర్పడింది. ఇదే పేరుగల తన కావ్యాన్ని కాళిదాస మహాకవి గ్రీష్మ ఋతువుతో ప్రారంభించగా విశ్వనాథ సత్యనారాయణ మాత్రం దీనిని వసంతంతో ప్రారంభం చేశారు. వసంత ఋతువు అందరికీ ప్రీతిపాత్రమైనదనే కాక తెలుగు వారి తొలి పండుగైన సంవత్సరాది వసంతంలోనే ప్రారంభమవడమూ కారణం కావచ్చు. తెలుగు నేల మీద పల్లె ప్రకృతిని సర్వాంగ సుందరంగా అభివర్ణించిన కావ్యంగా దీనిని పలువురు విమర్శకులు పేర్కొన్నారు.<ref name="మసన చెన్నప్ప-తెలుగు ఋతువులు" />
=== వసంతర్తువు ===
వసంతఋతువు వర్ణనను విశ్వనాథ సత్యనారాయణ ప్రియురాలి ఎదచెమర్చడంతో, బాలికల వాలుజడల్లో మల్లెమొగ్గలు కనిపించడం, వేపకొమ్మ చిగురించి కోకిల కుహూరావాలు చేయడం వంటివాటితో ప్రారంభమైనాయని మొదలుపెట్టారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఋతు_సంహారము" నుండి వెలికితీశారు