షోయబ్ ఉల్లాఖాన్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
== [[బూర్గుల నరసింగరావు]] కథనం==
"షోయబుల్లాఖాన్ హత్య జరిగేనాటికి ఆయనకు రెండు సంవత్సరాల కూతురు, భార్య నిండు చూలాలు. షోయబ్ చనిపోయాక ఆ కుటుంబాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. పునాదులు కోల్పోయిన ఆ ఫ్యామిలీకుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని కాయంగంజ్‌కు వలస వెళ్లింది. షోయబ్ తండ్రి నాలుగేళ్లపాటు వాళ్ల దగ్గర, వీళ్ల దగ్గర ఆర్థిక సాయం పొంది తర్వాత అతను కూడా కోడలి దగ్గరికి వెళ్లిపోయాడు.కాంగ్రెస్ నాయకులు [[మందుముల నర్సింగరావు]] బావ అయిన బూర్గుల రామకృష్ణారావు తమ తరఫున నిజాం దౌర్జన్యాలను ఎండగట్టే ఒక పత్రికుండాలని ఆరాటపడుతున్నాడు. షోయబుల్లాఖాన్ బూర్గుల సహాయంతో నగలునట్రా అమ్మి ‘ఇమ్రోజ్’ను స్థాపించారు. [[బూర్గుల రామకృష్ణారావు]] ఇంట్లో ఇమ్రోజ్ ఆఫీస్ ఉండేది. ఉర్దూలో ఇమ్రోజ్ అంటే ఈ రోజు.
ఆయన దేన్నయినా గుడ్డిగా నమ్మేవాడు కాదు. చాలా తార్కిక దృష్టి. అందుకే సోవియట్ యూనియన్‌లో స్టాలిన్ నియంతృత్వానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడేవాడు. ప్రజాస్వామ్యంలేని సోషలిజం ఎందుకని వాదించేవాడు. ఎమ్‌ఎన్ రాయ్ రాడికల్ హ్యూమనిస్ట్ పత్రికను తెప్పించుకునేవాడు. ఆయన రాతలు చాలా సీరియస్సే కాని మనిషి మాత్రం సరదాగా ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. సైద్ధాంతిక చర్చలప్పుడు కూడా అనవసర ఘర్షణలకు దిగేవాడు కాదు. చర్చను కూడా నెమ్మదిగా, నిలకడగా చేసేవాడు. జర్దాపాన్, సిగరెట్ ఆయన అలవాట్లు. షోయబుల్లాఖాన్ మంచి పెయింటర్. పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. రవీంవూదనాథ్ ఠాగూర్‌ది పెద్ద పోట్రయిట్ గీసాడు. ఉర్దూ, ఇంగ్లీష్ సాహిత్యాలంటే ప్రాణం పెట్టేవాడు.
ఏ మూల నిజాం ఆగడాలు చెలరేగుతున్నా, ఎక్కడ ఆర్మీ క్యాంప్స్ ఉన్నా వాటి గురించి నిర్భయంగా రాపేవాడు. హైదరాబాద్ ఇండియాలో విలీనం కావాల్సిందేనని తన రాతలతో స్పష్టం చేసేవాడు. నిజామ్‌కు వ్యతిరేకంగా ఉన్న [[ముస్లిం]] విద్యావంతుల అభిప్రాయాలను ప్రచురించేవాడు. నిజాం మొండితనానికి, రజాకార్ల ఉన్మాదానికి ఎక్కువ బలవుతోంది పేద ముస్లిం కుటుంబాలు, యువకులేనని ఎన్నో సార్లు ఆవేదన చెందాడు.హైదరాబాద్ ఇండియాలో విలీనం కావడమనేది షోయబుల్లాఖాన్ కల. లక్ష్యం. దాని కోసం నడిరోడ్డుమీద ప్రాణాలను బలిపెట్టాడు. అలాంటి త్యాగమూర్తికి మనమిచ్చిన గౌరవం... మలక్‌పేటలో ఆయన పేరు మీద ఒక గదితో లైబ్రరీ, చుట్టూ చిన్న పార్కు. ఇంతే. చూద్దామంటే ఆయన విగ్రహం లేదు. తర్వాత తరాలు తెలుసుకోవడానికి చరిత్ర లేదు. ఎంత విచిత్రం? పాత్రికేయ వృత్తికే వన్నె తెచ్చిన నిజాయితీపరుడు. ఇవాళ ఎంతమందికి తెలుసు ఆయనంటే? ఇంత నిర్లక్ష్యమా?నిజమే..ఎంత అలక్ష్యం? తెలంగాణ నిప్పు రవ్వకు టాంక్‌బండ్ మీద జాగ లేదు. పరాయి ప్రాంతం వాడైనా శ్రీకృష్ణదేవరాయలు రాజసంగా తిష్టవేస్తాడు. జన్మలో తెలంగాణపేరు తలవని వైతాళికులు ఠీవిగా కొలువుదీరి ఉంటారు. కాని హైదరాబాదు విముక్తి కోసం ప్రాణాలు ఇచ్చిన నిస్వార్థుడికి ట్యాంక్‌బండ్ మీద కాదు చరిత్రలోనే స్థానం లేకుండా చేశారు.ఈ పాపం ఎవరిది?"<ref>http://www.namasthetelangaana.com/Features/Article.asp?category=7&subCategory=7&ContentId=19777</ref>
"https://te.wikipedia.org/wiki/షోయబ్_ఉల్లాఖాన్" నుండి వెలికితీశారు