బెంగుళూరు నాగరత్నమ్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
==దిగ్విజయములు==
 
నాగరత్నమ్మ 25వ ఏట గురువు మునిస్వామప్ప మరణము ఆమె జీవితములో ఒక పెద్ద మలుపు. 1894 డిసెంబరులో మైసూరు నుండి మదరాసు చేరి రాజరత్న ముదలియార్ అను ధనికుని ప్రాపకము సంపాదించింది. ప్రఖ్యాత సంగీతకారులు నివసించు ప్రాంతములో ఇల్లు సంపాదించి ఉండసాగింది. అచట వీణ ధనమ్మాళ్ మంచి స్నేహితురాలయ్యింది. సంగీత సాధనకు పూచి శ్రీనివాస అయ్యంగారుల ప్రోత్సాహము దొరికింది. ఆమె ఇంటిలోని కచ్చేరీలకు, భజనల కార్యక్రమములకు చాల మంది సంగీత విద్వాంసులు వచ్చేవారు. నాగరత్నమ్మ దక్షిణ భారతమంతయూ దిగ్విజయముగా పర్యటించింది. ప్రతిచోటా కళాభిమానులు నీరాజనాలిచ్చారు. [[రాజమహేంద్రవరము]]లో [[శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి]] గారు తొడగిన గండపెండేరము, [[1949]]లో గృహలక్ష్మి స్వర్ణకంకణము గ్రహించడము ఆమె ప్రతిభకు తార్కాణముతార్కాణములు.
 
==త్యాగరాజ సేవ==