బెంగుళూరు నాగరత్నమ్మ: కూర్పుల మధ్య తేడాలు

Kishorechan (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 1337827 ను రద్దు చేసారు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
==బాల్యము, విద్య==
 
తల్లిప్రేమలో నాగరత్నమ్మ బాల్యము ఒడుదుడుకులు లేకుండా గడిచింది. గిరిభట్ట తమ్మయ్య అను గురువు వద్ద [[సంస్కృతము]], వివిధ కళలు నేర్చుకుంది. వయసుకు మించిన తెలివితేటలవల్ల ప్రతివిషయమూ చాలా త్వరగా ఆకళింపు చేసుకొనేది. మాతృభాష [[కన్నడము]], [[తెలుగుతెలుగుము]], [[తమిళము]], ఆంగ్ల భాషలు నాగరత్నమ్మకు కొట్టిన పిండి. తొమ్మిది ఏండ్లకే గురువుని మించిన శిష్యురాలై గురువు అసూయకు గురైయింది. పుట్టలక్ష్మమ్మ కూతురిని గొప్ప విదుషీమణిగా తీర్చిదిద్దిన తరువాతే మైసూరుకు తిరిగివస్తానని ప్రతినపూని మద్రాసు (చెన్నయి) చేరింది. మంచి గురువు కోసం అన్వేషణలో కంచి, చివరకు [[బెంగళూరు]] చేరింది. అచట మునిస్వామప్ప అను వాయులీన విద్వాంసుడు నాగరత్నమ్మకు సంగీతము నేర్పుటకు అంగీకరించాడు. [[త్యాగరాజు ]]శిష్యపరంపరలోని వాలాజాపేట వేంకటరమణ భాగవతార్, ఆతని కొడుకు కృష్ణస్వామి భాగవతార్ల శిష్యుడు మునిస్వామప్ప. ఈవిధముగా నాగరత్నమ్మ జీవితము త్యాగరాజస్వామి వారి సేవతో ముడిపడింది. కిట్టణ్ణ అను వానివద్ద నాట్యాభ్యాసము, తిరువేంగడాచారి వద్ద అభినయకౌశలము నేర్చుకుంది. తల్లి కనుసన్నలలో, గురువుల పర్యవేక్షణలో నాలుగు సంవత్సరాలు కఠోర శ్రమచేసి సంగీత నాట్యాలలో నిష్ణాతురాలయింది. పుట్టలక్ష్మమ్మ ఆనందానికి అవధులు లేవు. దురదృష్ఠవశాత్తు, నాగరత్నమ్మ పదునాలుగవ ఏట తల్లి మరణించింది.
 
==రంగ ప్రవేశము==
పంక్తి 27:
==సాహిత్య సేవ==
 
నాగరత్నమ్మ మాతృభాష కన్నడము అయిననూ సంస్కృతసంస్కృతము, తెలుగుతెలుగుము, తమిళ భాషలలో ప్రావీణ్యమును గడించింది. [[తిరుపతి వేంకటకవులు]] రచించిన [[శ్రవణానందము]] అనే పుస్తకములో [[ముద్దు పళని]] విరచితమగు [[రాధికా సాంత్వనము]] గురించి చదివి ఆ పుస్తకమును కొని చదువగా అందులో చాల తప్పులున్నాయని గ్రహించింది. వ్రాతప్రతులకు ముద్రిత ప్రతులకు చాల తేడాలున్నాయి. వ్రాతప్రతులన్నీ సంపాదించి 1911లో వావిళ్ళవారిచే పరిష్కృత పుస్తకము ప్రచురింపచేసింది. పుస్తకములో బూతు పద్యాలున్నాయని బ్రిటీష్ ప్రభుత్వము అభియోగము చేసింది. ప్రసిద్ధులైన కవులు, పండితులు, న్యాయవాదులు వావిళ్ళ వారి తరఫున అర్జీ పెట్టుకొన్నారు. అయినా బ్రిటిష్ ప్రభుత్వము పట్టు విడవలేదు. వావిళ్ళ దుకాణాలపై దాడి 1927లో జరిగింది. భారతదేశానికి స్వాతంత్ర్యము వచ్చిన తరువాత టంగుటూరు ప్రకాశం పంతులు గారి హయాములో బహిష్కారము తొలగించబడింది. ఆ సమయానికి నాగరత్నమ్మ [[తిరువైయ్యారు]]లో ఒక యోగినిగా మారింది.
ఈమె రచించిన గ్రంథములు కొన్ని: 1. శ్రీ త్యాగరాజ అష్టోత్తర శతనామావళి (సంస్కృతం),2. మద్యపానం (తెలుగు సంభాషణం), 3. దేవదాసీ ప్రబోధ చంద్రోదయం (తెలుగు), 4. పంచీకరణ భౌతిక వివేక విలక్కం(తమిళం)