రేఖాచిత్రం: కూర్పుల మధ్య తేడాలు

→‎పరికరాలు: మొదటి ప్యారా
→‎పరికరాలు: రెండవ ప్యారా
పంక్తి 53:
==పరికరాలు==
సిరా, వర్ణ పదార్థాలను మాధ్యమంగా ఉపరితలం పై రేఖాచిత్రాన్ని గీస్తారు. చాలా మటుకు రేఖాచిత్ర పరికరాలు పొడి పదార్థాలు (గ్రాఫైట్, చార్కోల్, పేస్టెల్స్, కాంటీ, సిల్వర్ పాయింట్) గా ఉంటాయి. మార్కర్ మరియు కలంలో ద్రవపదార్థాలు కూడా పరికరాలు ఉపయోగించబడతాయి. పొడిగా ఉండే రంగు పెన్సిళ్ళతో ముందుగా రేఖాచిత్రాన్ని పూర్తి చేసి తర్వాత కుంచెతో తడిని అద్దటంతో చిత్రంలో కొన్ని కళాత్మక ప్రభావాలని తీసుకురావచ్చును. బహు అరుదుగా కంటికి కనబడని సిరాతో కూడా చిత్రకారులు రేఖాచిత్రాలని గీసారు. వెండి మరియు సీసం తో చేసిన ఫలకాల పై కొన్ని రేఖాచిత్రాలు ఉన్ననూ, వీటి కంటే అరుదుగా స్వర్ణం, రాగి, కాంస్యం, కంచు మరియు తగరపు ఫలకాల పై కూడా అతి అరుదైన రేఖాచిత్రాలు కలవు.
 
కాగితం వివిధ పరిమాణాలలో మరియు నాణ్యతలలో లభిస్తుంది. తయారీ విధానం, రంగు, ఆమ్ల గుణం, తడి తగిలినా పటుత్వం కోల్పోకుండా ఉండే గుణం లో వీటిలో భేదాలు ఉంటాయి. నునుపైన కాగితం సూక్ష్మ వివరాలను చిత్రీకరించటానికి ఉపయోగపడగా, కరకుగా ఉండే కాగితం చిత్రీకరణకి ఉపయోగించే పదార్థాలని ఒడిసి పట్టుకొంటుంది. అందుకే వర్ణవైరుధ్యం లో స్పష్టతని తీసుకురావటానికి ముతక కాగితాన్నే వినియోగిస్తారు.
 
==సాంకేతిక అంశాలు==
"https://te.wikipedia.org/wiki/రేఖాచిత్రం" నుండి వెలికితీశారు