ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
వీరు 1923లో మొదటిసారిగా మద్రాసు విశ్వవిద్యాలయంలో సెనేట్ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1936 , 1940 లలో ఆక్టింగ్ వైస్ ఛాన్సలర్ అయి, అనంతరం 1942 నుండి 1969 వరకు 27 సంవత్సరాల పాటు, వరుసగా 9 సార్లు వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు.
== వ్యక్తిత్వం ==
లక్ష్మణస్వామి మొదలియారు ప్రశాంతంగా, నిజాయితీగా వ్యవహరించే వ్యక్తి. ఆయన ప్రవర్తన చుట్టుపక్కలవారిని ఎంతగానో మెచ్చుకునేటట్టుగా వుండేది. ఆయనతో వైద్యకళాశాలలో కలసి విద్యనభ్యసించి, తర్వాత ఆయన పొరుగింట్లో నివసించడం, సాటి వైద్యురాలు కావడం, ఆయనతో వైద్యంచేయించుకోవడం వంటి కారణాలతో దగ్గరగా పరిశీలించిన డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి ఆయన గురించి ‘‘ప్రపంచ అద్భుతాలలో ఒకటి’’ అనే వ్యాసంలో ఇలా అభివర్ణించారు -డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియారు ప్రశాంతంగా, నిజాయితీగా వ్యవహరించేవారు. ఇంగ్లీషులో మనస్సుకి హత్తుకునేలా మాట్లాడేవారు. అందువల్ల యూరోపియన్ సూపరింటెండెంటు కల్నల్ గిఫర్డు తదితరులు ఆయన్నెంతో అభిమానించేవారు. తత్ఫలితంగా ఆయనకు బదిలీల బెడద కూడా లేదు. అదే ఆసుపత్రిలో అవిచ్ఛిన్నంగా పనిచేయగలిగారు’’<br />
లక్ష్మణస్వామిలో ఎంతగా ప్రశాంత గాంభీర్యం తొణికిసలాడినా, దానిలోనే ఒక మర్యాదకరమైన హాస్యం కూడా తొంగిచూసేది.
 
== గౌరవ సత్కారాలు ==