ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
 
=== వైద్యబోధనలో ===
1934 లో మద్రాసు మెడికల్ కళాశాలలో ప్రసూతి వైద్య విభాగంలో ప్రొఫెసర్ పదవిని పొందారు. అనతికాలంలోనే ఆ కాలేజీకి ప్రిన్సిపాల్ గా పదవిని అధిష్టించిన తొలి భారతీయులుగా ఘనత పొందారు. ప్రిన్సిపాల్ గా ఆయన కళాశాలలో మంచి క్రమశిక్షణ నెలకొల్పారు. కేవలం మార్కుల ఆధారంగా కాక ఇతర కొలమానాలను ఉపయోగించి విద్యార్థి ప్రతిభను అంచనావేయాలని, విద్యబోధన తదనుగుణంగానే వుండాలని ఆయన నమ్మేవారు. మార్కులకు అతీతమైన ప్రతిభ, వైద్యరంగంలో రాణించగల సమర్థత విద్యార్థిలో కనిపిస్తే దాని ఆధారంగా విద్యార్థులను కళాశాలలో చేర్చుకోవచ్చని వాదించేవారు. దానిని ఆధారం చేసుకుని కొన్ని మార్పుచేర్పులు చేసి నిర్ణయాలు కూడా తీసుకోవడంతో కోర్టులో కూడా ఆయన ఒకసారి తన వాదనను వినిపించాల్సివచ్చింది.
 
== వైద్యరంగం ==