"ఖడ్గ సృష్టి" కూర్పుల మధ్య తేడాలు

ఖడ్గ సృష్టి తెలుగు సాహిత్యరంగంలో మహాకవిగా పేరొందిన [[శ్రీశ్రీ]] రచించిన కవితల సంకలనం. శ్రీశ్రీ సాహిత్యంలో మహా ప్రస్థానం తర్వాత ప్రసిద్ధి చెందిన పుస్తకం ఇది. ఇందులో శ్రీశ్రీ అధివాస్తవికత మొదలుకొని తనను ప్రభావితం చేసిన అనేక పాశ్చాత్య కవితా ధోరణుల్లో కవితలు రాశారు.
== రచన నేపథ్యం ==
ఖడ్గ సృష్టి కవితా సంకలనాన్ని తన చివరిజీవితం దశకంలోమలిదశలో రచించిన కవితలతో ప్రచురించారు శ్రీశ్రీ. 1966లో ఈ కవితా సంకలనం మొదటి పారి ప్రచురితమైంది.
 
== కవితా వస్తువులు ==
శ్రీశ్రీ రచించిన అసంపూర్ణ కావ్యం ''సదసత్సంశయం'', అధివాస్తవిక రచనలు, అనువాదాలు, అనుసృజనలు ఉన్నాయి. ఈ రచనలోని కవితల వస్తువు స్పష్టంగా మార్క్సిజాన్ని వ్యక్తీకరించేలా రాశారు. ఖడ్గ సృష్టి, శరశ్చంద్రిక, విషాదాంధ్ర, విశాలాంధ్రలో ప్రజారాజ్యం, గాంధీజీ, మంచి ముత్యాలసరాలు, ఆఖరిమాట మొదటిమాట!, విదూషకుని ఆత్మహత్య, టాంటాం, అభిసారిక కడసారి, ఒకటీ-పదీ, నగరంలో వృషభం, అధివాస్తవికుల ప్రవేశం, మాటల మూటలు, ఎన్నాళ్ళు ఇంకా, కొంటె కోణాలు, ఏవి తల్లీ, సామాన్యుని వేదన, రుబాయత్, భ్రమరగీత, బొమ్మలాంతరు మొదలైనవి కొన్ని శీర్షికలు.<br />
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1338578" నుండి వెలికితీశారు