మహాప్రస్థానం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
== రచనా నేపథ్యం ==
1930 దశకం ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం వల్ల నిరుద్యోగులైన యువకుల జీవితాలు మొదలుకొని చిరుద్యోగుల వరకూ సమాజంలోని అనేకమైన వర్గాల జీవితాలు అల్లకల్లోలమైన సమయం. ఆ కాలాన్ని ఆకలి ముప్పైలు (హంగ్రీ థర్టీస్) అని పిలిచారు. ఈ దశలో వ్యక్తిగతంగానూ, సాంఘికంగానూ శ్రీశ్రీ చుట్టూ జరిగిన సాంఘిక పరిణామాలు ఆయన రచనా వస్తువులను నిర్దేశించాయి. రచనా క్రమంలో కూడా మొదట పద్యాలను భావకవుల ప్రభావం వ్రాస్తున్న శ్రీశ్రీ క్రమంగా ఇతర భాషల్లో వస్తున్న ప్రక్రియాపరమైన మార్పులు అర్థం చేసుకుంటూ ఒకానొక పరిపక్వమైన దశకు చేరుకున్నారు. అలాంటి స్థితిలో 1934 నుంచి 1940 వరకూ తాను రాసిన కవితల్లోని ఉత్తమమైన, మానవజాతి ఎదుర్కొంటున్న బాధల గురించి, క్రొత్తగా వెలువడాల్సిన సాహిత్యం గురించి వ్రాసిన కవితలను మాత్రం తీసుకుని 1950ల్లో ప్రచురించారు.<br />
సంకలనంగా కాక విడివిడిగా ప్రచురణ పొందిన, వేర్వేరు కవితావేదికలపై కవితాగానం చేస్తున్న దశలోనే మహాప్రస్థానంలోని కవితలు పేరు ప్రఖ్యాతులు పొందాయి. ''కవితా! ఓ కవితా!!''ను నవ్యసాహిత్య పరిషత్తు వేదికపై తన ధోరణిలో గొణుగుడు లాంటి స్వరంతో చదువుతుండగా అదే వేదికపై అధ్యక్షునిగా కవిసమ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]] ఉన్నారు. తొలినాళ్ళలో శ్రీశ్రీకి అభిమానపాత్రుడైనవాడు, అప్పటికే గొప్పకవిగా పేరు సంపాదించినవాడు విశ్వనాథ సత్యనారాయణ కవిత పూర్తవుతుండగానే తడిసిన కన్నులతో వేదికపైన అటు నుంచి ఇటు నడచుకుంటూ వచ్చి కౌగలించుకుని ప్రస్తుతించారు. కాకినాడలో కమ్యూనిస్టు యువకుల మహాసభలో శ్రీశ్రీ చదివిన గేయం కూడా ఇందులో ఉంది. దానిని విని [[అడవి బాపిరాజు]], [[శ్రీరంగం నారాయణబాబు]] దానిని అనుకరించే ప్రయత్నాలు చేయగా, ముద్దు కృష్ణ తన పత్రికయైన జ్వాలలో పట్టుపట్టి ప్రచురించుకున్నారు. [[జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి]] పాడి వినిపించగా [[చలం]] కన్నీళ్ళు పెట్టుకునేలా చేసిన చేదుపాట అనే గేయం కూడా ఇందులో చేరింది. సంకలనంగా ప్రచురణకు ముందే ఇందులోని చాలా కవితలను అడవి బాపిరాజు, [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] అప్పటికే చేస్తున్న సభల్లో పలువురు కవుల పాటలతో కలిపి పాడేవారు. ఆ విధంగా కూడా ఈ గీతాలు ప్రాచుర్యం పొందాయి.<br />
నవ్యసాహిత్య పరిషత్తు వేదికపై కవితా ఓ కవితా గేయాన్ని విన్న విశ్వనాథ అక్కడిక్కడే శ్రీశ్రీని ఆర్ద్రంగా అభినందించడంతో పాటుగా దానిని ప్రచురిస్తానని, ముందుమాట చలం వ్రాయల్సిందని అన్నారు.
 
== ఇతివృత్తం ==
"https://te.wikipedia.org/wiki/మహాప్రస్థానం" నుండి వెలికితీశారు