మహాప్రస్థానం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
== ఇతివృత్తాలు ==
మహాప్రస్థానం గేయాల్లోని ఇతివృత్తాలు ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా మానవజాతి ఎదుర్కొంటున్న బాధలు, వీటికి నేపథ్యంగా ఉన్న చారిత్రిక పరిణామాలు, పీడితుల పక్షాన నిలవాల్సిన కవికి అవసరమైన లక్షణాలు, నూతనమైన ఈ అంశాలపై రావాల్సిన కవిత్వమూ, తన కవిత్వానికి లక్షణాలు, పీడితులను ఇంకా పీడించేందుకు సహాయకారిగా ఉండే తాత్త్వికతలపై తిరుగుబాటు వంటివి ఉన్నాయి. వీటన్నిటికీ మూలమైన నేపథ్యంగా తన కవితాతాత్త్వికతనీ, దానికి వెనుకనున్న సంఘర్షణనీ అపురూపంగా వెల్లడించిన కళాఖండమైన '''కవితా ఓ కవితా''' కూడా ఉంది.
 
=== యోగ్యతా పత్రం ===
 
యోగ్యతా పత్రం - మహాప్రస్థానం పుస్తకానికి 1940 లో [[చలం]] రాసిన పీఠిక. తెలుగు సాహిత్యంలో వచ్చిన గొప్ప పీఠికలలో ఇది ఒకటి. ఆ పుస్తకం ఎవరు చదవాలో, ఎందుకు చదవాలో, ఎలా చదవాలో వివరించే పీఠిక అది. "రాబందుల రెక్కల చప్పుడు పయోధర ప్రపంచ ఘోషం ఝంఝానిల షడ్జధ్వానం" విని తట్టుకోగల చావ ఉంటే ఈ పుస్తకం తెరవండి." అంటూ పుస్తకం చదవడానికి పాఠకుడిని సమాయత్త పరచే పీఠిక అది. యోగ్యతాపత్రంలో చలం రాసిన కొన్ని వాక్యాలు మచ్చుకు:
"https://te.wikipedia.org/wiki/మహాప్రస్థానం" నుండి వెలికితీశారు