వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
వేంకటాద్రి పాలనలో [[చెంచులు]] దారిదోపిడులు చేయుచు సామాన్య ప్రజలను బాధించుచుండేవారు. మంత్రి ములుగు పాపయారాధ్యుల సలహా పాటించి చెంచులను విందునకు అహ్వానించాడు. భోజనమైన పిమ్మట 150 మంది చెంచు నాయకులను వరుసగా నిలబెట్టి అందరిని వధింపచేశాడు. ఈ వధ జరిగిన ఊరి పేరు [[నరుకుళ్ళపాడు]] గా మారింది.
 
ఆయన చివరిదశలో తీర్థయాత్రలు చేసేందుకు పరివారంతో బయలుదేరి భారతదేశంలోని ఎన్నో తీర్థాలను, క్షేత్రాలను దర్శించారు. వెళ్లిన చోట్లన్నిటా అన్నదాన సత్రాలు స్థాపించారు. కొప్పరాజు సుబ్బరాయకవి కాంచీమహాత్మ్యంలో నాయుడి యాత్రల గురించి పద్యరచన చేశారు. వేంకటాద్రి నాయుడితో పాటుగా ఆయన మంత్రి పొత్తూరి కాళిదాసు కూడా యాత్రలు చేసినట్టు పాపయారాధ్యులు రచించిన సరస హృదయానురంజనములో తెలుస్తోంది. కొన్ని యాత్రలు క్రీ.శ.1802, మరికొన్ని క్రీ.శ.1812-13 సంవత్సరాల్లో చేసినట్టు తెలుస్తోంది.<ref name="చారిత్రిక శ్రీశైలం">{{cite book|last1=లక్ష్మీనారాయణ|first1=కొడాలి|title=చారిత్రిక శ్రీశైలము|date=1967|edition=ప్రథమ ప్రచురణ}}</ref>
శేషజీవితమును అమరేశ్వరుని పాదాలకడ గడిపినాడు. దేవాలయానికి పెక్కు హంగులు చేసి తొమ్మిదిమంది అర్చకులను నియమించి ఒక్కొక్కరికి 12 ఎకరాలు భూమి ఇచ్చాడు. 1807-09లో [[మంగళగిరి]] నరసింహ స్వామి దేవాలయానికి 11 అంతస్థుల గాలి గోపురాన్ని నిర్మింపజేశాడు. ఆయన తండ్రి జగ్గన్న పేరు మీదనే '''బేతవోలు''' అనే గ్రామం పేరును [[జగ్గయ్యపేట]] గా మార్చాడు. ఆయన తల్లి అచ్చమ పెరు మెదనె అచ్చమ్మపెట గా మారినది. వేంకటాద్రి నాయుడు [[1817]], [[ఆగష్టు 17]]న మరణించాడు.