ఉదాహరణ వాజ్మయము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
తరువాత వెలసింది [[త్రిపురాంతకోదాహరణం]]. కాలక్రమేణ ఇది రెండోదైనా, రచనా కోశలములో మాత్రము ఎది అగ్రస్థానము వహిస్తుందని చాలా మంది విమర్సకుల అభిప్రాయము. దీని మూలప్రతి తంజావూరు సరస్వతీ గ్రంధ భాండాగారంలో లేకపోవడము చేత దీనిని రచియించిన వాడు "గుండయ" కవి అయి ఉంటాడని [[గిడుగు వెంకటరామమూర్తి]] పంతులుగారు మొదట భావించారు. అటుపై దీనిని పరిశీలించిన [[నిడదవోలు వెంకటరావు]] పంతులుగారు ఈ గ్రంధము [[రావిపాటి త్రిపురాంతకుడు]] వ్రాసాడని, అతని వాడుక పేరు తిప్పన్న అని నిర్ధారణ చేసారు. ఈకవి 14వ శాతాబ్దములో జీవించాడు. మహాకవి అయిన [[శ్రీనాధుడు]] పొగడ్తకు ప్రాతుడైనాడు. ఈ ఉదాహరణనే కాకుండా రావిపాటి తిప్పన్న అంబికాశతకము, చంద్రతారావళి, సంస్కృతములో ప్రేమాభిరామం మొదలైన గ్రంధాలని రచించాడు. త్రిపురాంతకోదాహరణం లో శివలీలల్ని మనోహరముగా వర్ణితమయినాయి. శివాద్వైతానికి కవి ప్రాముఖ్యాన్ని ఇచ్చాడు. సాంఖ్య తొండడు, బల్లహుడు, కన్నప్ప, సేనమరాజు మొదలైన భక్తుల గాధలను కవి ఈ ఉదాహరణంలో మనోహరముగా చిత్రించాడు. ఇతను కళికలో అనేకమైన శివలీలలనుగాని గాధలను గాని వివరించి, ఉత్కళికలో సాధారణంగా ఏదో ఒకగాధను మాత్రమే వెలువరుస్తాడు.
 
అటుపై వచ్చినది [[వెంకటేశ్వరరోదాహరణమువెంకటేశ్వరఉదాహరణము]]. దీనిని [[తాళ్ళపాక పెదతిరుమలాచార్యులు]] వారు రచించారు. ఇది 16వ శతాబ్దములో వెలువడినది. పెదతిరుమలాచార్యులు గారు వీరి తండ్రి అయిన [[అన్నమాచార్యులు]] వారు, పెదతిరుమలాచార్యులు గారి కుమారులు చిన పెదతిరుమలాచార్యులు వారు సంగీతములో విశేష కృషి చేసిరి. దీనిలో సార్వ విభక్తిక పద్యం పూర్తి అయినాక షష్ట్యంలతో కూడిన అంకితాంక పద్యం రచించాడు. వృతాలలో వెంకటేశ్వర ప్రభావాన్ని, రగడలలో రామ కృష్ణాద్యవతారాలకు సంబందించిన లీలా విశేషాలని ఈ కవి ఎంతో మనోహరముగ రచించాడు.
 
ఈ విధంగానే మరికొందరు కవులు వ్రాసిన [[కృష్ణోదాహరణ]] , [[హనుమదుహారణ]] మొదలైనవి కూడాఅ ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/ఉదాహరణ_వాజ్మయము" నుండి వెలికితీశారు