అలిపిరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
==అలిపిరి చరిత్ర==
పూర్వం అలిపిరిని ''అడిపుళీ'' అని పిలిచేవారు. ''అడి'' అంటే పాదం ''పుళ'' అంటే చింత చెట్టు. పూర్వం పెద్ద [[చింత]] చెట్టు వున్నందున ఇది అలిపిరిగా పిలువబడింది. ఈచెట్టు క్రిందే [[తిరుమల నంబి]] [[రామానుజాచార్యుడు|రామానుజుని]]కి [[రామాయణం|రామాయణ]] రహస్యాలను ఉపదేశించాడని ఇతిహాసాలు చెబుతున్నాయి. మధ్యాహ్నాపు వేళలో రామానుజునికి పాఠం చెప్పడంలో నిమగ్నమై ఉన్నప్పుడు పరమాత్ముని పూజలకు వేళ అయినప్పుడు నంభి తపనని తీర్చే స్వామి పాదాలు ప్రత్యక్ష మయ్యాయట. ఇంకో ఇతిహాసం ప్రకారం కురువతి నంభి [[వేంకటేశ్వరుడు|వేంకటేశ్వరుని]] నైవేద్యం కోసం మట్టికుండలు తయారు చేస్తూ ఇక్కడ నివసించాడు. మట్టితో పుష్పాలు చేస్తూ వాటిని భగవత్పాదులకు అర్పణ చేసేవాడు. నంభి కూలాల చక్రం, మట్టి ముద్ద, కూలాల సమ్మెట్టలు శిలాఫలకాలుగా రెండవ గాలి గోపురం మెట్ల ప్రక్కన ఉన్నాయి.
 
1830లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రికుడు, యాత్రాచరిత్రకారుడు [[ఏనుగుల వీరాస్వామయ్య]] అప్పట్లో ఈ ప్రాంతం ఎలావుండేదో వ్రాశారు. గాలిగోపురం వరకూ ఎక్కడం, దిగడం బహు ప్రయాస అని వ్రాసుకున్నారు. అక్కడ నుంచి కొంత భూమి సమంగా ఉండేదని, మళ్ళీ ఎక్కిదిగాల్సిన ప్రాంతాలున్నా ఆపై ప్రయాణం అంత ప్రయాసగా ఉండేది కాదన్నారు. దారిలో నిలిచేందుకు జలవసతి గల మంటపాలు చాలా ఉండేవి. గాలిగోపురం వద్ద ఒక బైరాగి శ్రీరామవిగ్రహాన్ని పూజిస్తూ, యాత్రికులకు మజ్జిగ వంటివిచ్చి ఆదరించేవాడని వ్రాశారు<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>.
 
==తిరుమలకు కాలి బాటలు==
"https://te.wikipedia.org/wiki/అలిపిరి" నుండి వెలికితీశారు