శైవం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
==వీరశైవం==
ఆది జగద్గురు శ్రీ రేణుకాచార్య భగవత్పాదులు శ్రీ స్వయంభు సోమేశ్వర లింగం నుండి లింగోద్బవం చెంది పరమశివుడి ఆనతి మేరకు ఈ భుమండలంపైన శక్తివిశిష్టాద్వైతాన్ని స్తాపించడం జరిగింది.ఈ శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్నే వీరశైవంగా పిలుస్తారు. వీరశైవ మతానికి సంబంధించి మూలమైన అయిదుగురు పంచాచార్యులలో ఈ రేణుకులు ప్రథములు. వీరి గురించి 28 శివాగమాలలొ చాలా చోట్ల ప్రస్తావించబడింది. ప్రధానంగా స్వయంభువాగమ, వీరాగమ, సుప్రభేదాగమాల్లో వివరించబడి ఉంది. వీరు వీరసింహసనం అను పేర పీఠమును స్థాపించడం జరిగింది ఈ పీఠమూల పరంపర ఇప్పటికీ కొనసాగుతున్నాయి.శ్రీ రెణుకాచార్యుల వారు కృతయుగమున అగస్త్య మహాముని వినతి మేరకు అగస్త్యునికి శైవ సిద్దాంతమును ఉపదేశించారు.
తెలుగులో వీరశైవ ప్రచారం కోసం పాల్కురికి సోమనాథుడు అనేక రచనలు చేశాడు. సమాజంలోని అన్నివర్గాల వారికి అందుబాటులోకి రావాలని వివిధ ప్రక్రియలు చేపట్టాడు. పురాణం, చరిత్ర కావ్యం, శతకం, ఉదాహరణ కావ్యం, గద్యలు, రగడలు, అష్టకం, పంచకం, స్తవం, భాష్యం ముఖ్యంగా పేర్కొనదగినది. వీటిలో కొన్ని తెలుగులోను, కొన్ని కన్నడం, సంస్కృతంలోనూ రచించాడు. పండితుల కోసం రుద్ర భాష్యం, సోమనాథ భాష్యం రచించాడు.
రేణుకాచార్యులు అగస్త్య మహామునికి ఉపదేశించిన శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్ని, శివయోగి శివాచార్యులు "సిద్దాంత శిఖామణి" పేరిట సంస్కృత భాషలో గ్రంధస్తం చేయటం జరిగింది. ఈ గ్రంధం అప్పటికే వీరాగమాది 28 గ్రంధాల్లో ఉన్న వీరశైవ తత్వాన్ని సంగ్రహించి రాయటం జరిగింది. సిద్దాంత శిఖామణి, సిద్దంతాలకన్నిటికీ తలమానికమై శిరోరత్నమువలె భాసిల్లటం జరుతుగుతుంది. ఈ శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్ని రేణుకాచార్యుడు భోదించటం వలన దీనిని "రేణుకాగీత" అనికూడా పిలవబడుతుంది
బ్రహ్మసూత్రములకు శక్తి విశిష్టాద్వైత సిద్దంతపరంగా(వీరశైవ పరంగా )భాష్యము - నీలకంఠ భాష్యం వ్రాసిన శ్రీకంఠ శివాచార్యులు వీరశైవులకు ఆగమోక్త ప్రామాణిక గ్రంథమైన సిద్దాంత శిఖామణి గూర్చి క్రింది విదంగా ప్రస్తుతించటం జరిగింది. ఈ గ్రంధమే సమస్త వీరశైవులకు ప్రామాణిక గ్రంథము.
శ్రీకంఠ శివాచార్యులు కూడా తమ బ్రహ్మసూత్ర భాష్యం శ్రీకంఠ భాష్యములో సిద్దాంత శిఖామణి శ్లోకములనుప్రమాణ యుక్తముగా ఉదాహరించుట జరిగింది., తన శ్రీకంఠ భాష్యమున "అవిభాగేన ద్రుష్టత్వాత్ " అను బ్రహ్మ సూత్ర భాష్యమున సిద్దాంత శిఖామణి 9 వ పరిచ్చేదమందలి14 వ శ్లోకము "ప్రసన్నే సతి ముక్తఃస్యాన్ ముక్త శివ సమొభవేత్" అను శ్లోకమును ప్రమాణ పూర్వకంగా ఉదాహరించుట జరిగింది..
ప్రసిద్ద సిద్దాంత కౌముది కర్త భట్టోజీ దీక్షితుల "తంత్రాదికార నిర్ణయము" లోనూ, కమలాకరభట్టు రచించిన "నిర్ణయ సింధు" లోనూ, మరియూ "శారదా తిలక" , "నిర్మాల్య రత్నాకరము", "శైవ బ్రాహ్మనోత్పత్తి" మొదలుగాగల గ్రంధములలో సిద్దాంతశిఖామణి ప్రమాణముల ఉదాహరించుట జరిగింది.
10వ శాతబ్దంలో బ్రహ్మసూత్రములకు శక్తి విశిష్టాద్వైత సిద్దంతపరంగా(వీరశైవ పరంగా )భాష్యము శ్రీకరభాష్యం వ్రాసిన శ్రీపతి పండితాచార్యుడు వీరశైవులకు ఆగమోక్త ప్రామాణిక గ్రంథమైన సిద్దాంత శిఖామణి గూర్చి క్రింది విదంగా ప్రస్తుతించటం జరిగింది.
తన శ్రీకర భాష్యమున "పత్యుర సామంజస్యాత్" అను బ్రహ్మసూత్ర భాష్యమున సిద్దాంత శిఖామణి 5 వ పరిచ్చేదము లోని "అగస్త్యముని శార్దూల... " ఆదిగా గల 8 శ్లోకాలనూ ఉదాహరించటం జరిగింది.అలాగే "అథాతోబ్రహ్మ జిజ్ఞాసా" అను బ్రహ్మ సూత్ర భాష్యమున కూడా:"పవిత్రంతే - ఋగ్వేద మంత్రస్య సిద్దాంత శిఖామణి శ్రీ రేణుకాచార్యేన లింగాధారణ పర్వతేన నిర్దేశిత్” అని"రేణుక భగవత్పాద చార్యేణాపి - పిండతాపిండ విజ్ఞాన మిత్యారభ్యవితాని శివ భక్తస్య కర్తవ్యాని ప్రయత్నతః "ఇత్యంతేన సిద్దాంత శిఖామణౌ తస్యే ఉపదేశితే" అని వివరించి సిద్దాంత శిఖామణి గ్రంథ ఔన్నత్యాన్ని కొనియాడాడు.
అంతేకాకుండా ఈ పనికిరాని సన్నాసులు వేదవ్యాసుడికంటే గొప్పవారా ....వేదవ్యాసుడు తన స్కంద పురాణము శంకర సణితలో అధ్యాయము 85 నందు శ్రీశైల సూర్యసింహనాధీశులైన జగద్గురు శ్రీ సదానంద శివాచార్య భగవత్పాదుల గారిని గూర్చి ఈ విధముగా స్తుతించారు.
తస్మిన్ శ్రీ పర్వతేపుణ్యే, సన్సారామయభేషజే|
ఆస్తే లింగాంగ సంబంధీ, సదానందాహ్వయోమునిః||
సర్వోపనిషదర్ధజ్ఞః - శివధ్యాన పరాయణాః|
భస్మావలిప్త సర్వాంగో -రుద్రాధ్యాయ జపాశ్రయః||
రుద్రాక్ష మాలాభరణో - దృతపాశుపత వ్రతః|
అతివర్ణాశ్రమీయోగి -జీవన్ముక్తో జగద్గురుః||
తం సదానంద నామానం -- శంకరధ్యాన లాలసం|
నిరస్తకుహకం విప్రం - సహపుత్రేణ పూజయ||
తస్యప్రసాదత్వే - పుత్రోగచ్చేన్నీరోగతాం ధృవం|
తస్మాదుత్తిష్ఠ గచ్చత్వం - శ్రీఅ పర్వతమతంద్రితః||
తాత్పర్యము:-
శ్రీశైల సూర్యసింహనాధీశులైన జగద్గురు శ్రీ సదానంద శివాచార్య భగవత్పాదులు సంసార రోగమును పారద్రోలుదురు. పరమ పవిత్రులు, భస్మరుద్రాక్షధారులు, శ్రీ రుద్రాధ్యాయ, జపాసక్తులు, (సంసార రోగ నాశకులు)జీవన్ముక్తులు,జగద్గురువులు, శ్రీశైల క్షేత్రమున ఉన్నారు. వారిని పూజించినట్లయితే వారి అనుగ్రహము వలన నీ కుమారుడైన పింగళుడు రోగ విముక్తుడు అగును. నీవు తక్షనమే శ్రీశైల క్షేత్రమునకు వెళ్లుమని హరప్రియుడు శ్వేతునకు చెప్పినట్లు వేదవ్యాస మహర్షి స్కంద మహాపురాణము యొక్క శంకర సంహిత లోని 85వ అధ్యాయము లో శ్లొకము 90 నుండి 95వ శ్లోకము వరకు వివరించి ఉన్నాడు.
మరియు తన పద్మపురాణాంతర్గత, శివగీత 16 వ అధ్యాయం యందు
అఙ్ఞో పహాస భక్తాశ్చ-భూతి రుద్రాక్షధారిణ|
లింగినోయశ్చవాద్వేష్టి - తేనైనా త్రాధికారిణ||
ప్రతిమా శివలింగంవా - దేవ్యైరేతః కృతంతుయత్|
తత్రమాం పూజయేత్తేషు - ఫలం కోటి గుణోత్తరమ్||
తా: అఙ్ఞాని, అపహాస్యము చేయువాడు, విభూతి రుద్రాక్ష లింగధారులెఉన శివభక్తులను ద్వేషించువారు మోక్షమును పొందుటకు అర్హులు కారు. ఎవరైతే భక్తితో శివలింగాన్ని పూజిస్తారో, వారే ముక్తిని పొందుటకు అర్హులు.
తన శివ మహాపురాణము యొక్క విద్వేశ్వర సంహితలో 16వ అధ్యాయములో 159వ స్లోకమున
శివభక్తో వసేన్నిత్యం - శివలింగం సమాశ్రితః|
పూజయాచర లింగస్య - క్రమాన్ముక్తో భవేధృవమ్||
తా: శివభక్తుడైనవాడు ఎల్లప్పుడూ తన దేహము పై శివలింగమును ధరించియున్నను జంగమమూర్తి పూజ వలననే మోక్షమును పొదగలడు అని చెప్పబడినది.
 
 
 
 
వీరశైవ మత పురాణమైన [[బసవ పురాణం]]లో బసవేశ్వరుని చరిత్ర ప్రధానమైనది. ఒక మత ప్రవక్త జీవితాన్ని పురాణంగా నిర్మించిన మొదటి దేశీయ పురాణం ఇది. వీరశైవంలోని ముగ్ధ భక్తిని, వీర భక్తిని, జ్ఞాన భక్తిని ముప్పేటగా వర్ణించే రచన ఇది. ఇందులో బసవేశ్వరుని జీవితంతో పాటు అతని సమకాలీనులైన భక్తుల కథలను, ప్రాచీన శివ భక్తుల కథలను కలిపి వర్ణించాడు. అందువలన బసవ పురాణం శివభక్తి కథా సాగరంగా రూపొందింది.
==నాయనార్లు==
{{main|నాయనార్లు}}
"https://te.wikipedia.org/wiki/శైవం" నుండి వెలికితీశారు