జడ్చర్ల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
*ఇది 7 వ నెంబరు [[జాతీయ రహదారి]] పై ఉన్న ముఖ్య కూడలి. [[హైదరాబాదు]] నుంచి [[కర్నూలు]], [[బెంగుళూరు]] వైపు వెళ్ళు అన్ని ఆర్టీసీ బస్సులు ఇచ్చట ఆపుతారు. ఇది [[బడేపల్లి|బాదేపల్లి]] జంట పట్టణం. ప్రస్తుతం ఈ రెండు పట్టణాల గ్రామపంచాయతీలు వేరువేరుగా ఉన్ననూ భౌగోళికంగా ఈ పట్టణాల మధ్య సరిహద్దు గుర్తించడం కష్టం. చాలా కాలం నుంచి ఈ రెండు పట్టణాలను కల్పి [[పురపాలక సంఘం]] చేయాలనే ప్రతిపాదన ఉన్ననూ రాజకీయ కారణాల వల్ల వాయిదా పడుతోంది.
== చరిత్ర ==
19వ శతాబ్ది తొలి అర్థభాగంలో ఈ పట్టణంలో తన కాశీయాత్రలో భాగంగా మజిలీచేసిన యాత్రాచరిత్రకారుడు [[ఏనుగుల వీరాస్వామయ్య]] ఈ పట్టణాన్ని గురించి తన కాశీయాత్రచరిత్రలో వ్రాశారు. ఆయన వర్ణించినదాని ప్రకారం 1830నాటికే ఇది చక్కని బస్తీగా ఉండేది. రమణీయమైన కొలను, చుట్టూ మండపాలతో మంచి దేవాలయం ఉండేదన్నారు. పట్టణంలో సంపన్న వర్తకులైన కోమటి కులస్తులు ఉండేవారని వ్రాశారు. అప్పటికే జడ్చర్లలో సకల పదార్థాలూ దొరికేవన్నారు. ఆ ఊరు ఆనాటికి ఆరువేల నియోగి బ్రాహ్మణ కులస్థుడైన రాజగోపాలరావు అనే వ్యక్తికి తరతరాలుగా జమీందారీ కింద ఉండేదన్నారు. అయితే అతని వయస్సు అప్పటికి 12 సంవత్సరాలు కావడంతో ఆయన తల్లి పరిపాలన చేసేవారు. 3 లక్షల వరకూ సంవత్సరానికి నవాబుకు కట్టుకునే ఆ సంపన్న జమీందారీ పాలకులు ధర్మపాలన చేసేవారని పేరున్నట్టు వీరాస్వామయ్య వ్రాశారు. వారికి రాచూరు అనే గ్రామం రాజధానిగా ఉండేదన్నారు<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>.
 
==జనాభా==
2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 102557. ఇందులో పురుషులు 51440, మహిళలు 51117. అక్షరాస్యుల సంఖ్య 61056.<ref>Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127</ref> మండలంలో పట్టణ జనాభా 50366 కాగా, గ్రామీణ జనాభా 52191.
"https://te.wikipedia.org/wiki/జడ్చర్ల" నుండి వెలికితీశారు