దోమా వేంకటస్వామిగుప్త: కూర్పుల మధ్య తేడాలు

3,751 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
 
'''దోమా వేంకటస్వామిగుప్త''' దోమా కోటాంబ, దోమా గోవిందప్ప శ్రేష్ఠి దంపతులకు కర్నూలు పట్టణంలో జన్మించాడు. సంస్కృత ఆంధ్ర భాషలలో పట్టు సంపాదించాడు. స్కూలు ఫైనల్ ఇంగ్లీషు మీడియంలో చదివాడు. అష్టావధానాలు, శతావధానాలు చాలా చేశాడు. ఆశుకవిత్వం చెప్పాడు. అనేక చోట్ల ఇతడు సన్మానాలు పొందాడు. ఇతడు హరికథారచయిత, కవి, నాటక కర్త,విమర్శకుడు,శతకకర్త మరియు నవలారచయిత. '''చంద్రిక''' అనే పత్రికకు సంపాదకుడు.
 
==కవితా వ్యాసంగం==
పదకొండు సంవత్సరాల వయసులోనే కవితావ్యాసంగం ప్రారంభించాడు.
ఆంధ్ర విశ్వ విద్యాలయానికి అనకాపల్లి వాస్తవ్యులు రేపాక సత్యనారాయణ రచించిన గ్రంధం ఆధారంగా ఈయన “కన్యకాపురణ పరిశీలన” అనే సిద్ధాంత గ్రంధం రాసి “ఎం.ఫిల్” పట్టాని పొందాడు. ఇతని ఉద్యోగపర్వం 1916 వ సంవత్సరంలో ప్రారంభమైంది. కంచి పచ్చయప్ప ఉన్నత పాఠశాలలో, మద్రాసు క్రైస్తవ కళాశాలలో, పెరంబూరులోని కళాశాల, విజయవాడలో యస్.ఆర్.ఆర్ సి.వి.ఆర్ కళాశాల మొదలగు చోట్ల తెలుగు పండితుడిగా, ఆంధ్రోపన్యాసకునిగా పని చేసాడు. 1933 లో విద్వాన్ పట్టాని పొందినాడు. గుప్త 2-2-1938లో [[మహాత్మా గాంధీ]]ని కలసి తెలుగు భాషకే ప్రత్యేకమైన అవధాన కళను గురించి వినిపించగా అది విన్న మహాత్ముడు, ఆశ్చర్యపడి అవధాన విద్యను అభ్యసించేందుకు శారదోపాసన అవసరమౌతుందని అభిప్రాయ పడ్డాడు.
సాహితీ ప్రముఖులుగా ప్రశస్తిగన్న [[ఉన్నవ లక్ష్మీనారాయణ]], [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]], [[చిలుకూరి నారాయణరావు]], [[శ్రీపాద కృష్ణముర్తి]] మొదలైనవారు ఇతని అవధానసభల్లో అగ్రాసనాధిపులు గానో పరీక్షకులు గానో ఉండి సభలను రంజిపజేసినారు.
[[తిరుపతి వేంకటకవులు]] గుప్త యొక్క విద్యగురువులు. గుప్త చేసే ప్రతి అవధానంలో ప్రారంభంలో ఈ కవుల గురించి ఏదో ఒక పద్యము చెప్పి గురుస్తుతి చేసేవాడు.
గుప్త తమ జీవిత కాలంలో దాదాపు 49,౦౦౦ పద్యాలు వ్రాశాడంటే ఎంత ప్రతిభావంతుడో అర్థమవుతుంది.
 
==రచనలు==
Line 82 ⟶ 89:
* శతావధాని
* వైశ్యకుల భూషణ
==సన్మానాలు, పురస్కారాలు==
2-5-1949 వ సంవత్సరంలో విజయవాడలో ఎందరో పెద్దల సమక్షంలో జరిగిన గజారోహణం, సన్మానపత్రం, కనక స్నానం, గండ పెండేరం, సువర్ణ పాత్ర, వెయ్యిన్నూటపదహార్ల నగదులతో జరిగిన అత్భుత సత్కార కార్యక్రమం ఇతని జీవితంలో మరపు రాని మధురమైన సువర్ణ ఘట్టం.
 
==మూలాలు==
80,309

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1342845" నుండి వెలికితీశారు