గులాం రసూల్ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
గులాం రసూల్ ఖాన్ [[కర్నూలు నవాబులు]] పాలకవంశానికి చెందిన ఆఖరి పరిపాలకుడు. గులాం రసూల్ ఖాన్ కర్నూలు నవాబుల్లో మూడవ పరిపాలకుడైన ఆలూఫ్‌ఖాన్ కట్టకడపటి కుమారుడు. ఇతనిపై అలూఫ్‌ఖాన్‌కు ఉన్న ప్రేమ కారణంగా మొదట ఆయన జన్మించివుండగానే కర్నూలుకు నవాబును చేసుకున్నారు.
== రాజకీయ నేపథ్యం ==
గులాం రసూల్ ఖాన్ 1792 నుంచి కర్నూలును పాలించిన నవాబు అలూఫ్‌ఖాన్ కుమారుడు. అలూఫ్‌ఖాన్ తండ్రి మునవర్ ఖాన్ మరణానంతరం రాజ్యాన్ని పొందగా అప్పటికి రాజ్యం మైసూరు నవాబుల పరిపాలనలో ఉండేది. అలూఫ్ ఖాన్ పరిపాలన కాలంలో జరిగిన మూడో మైసూరు యుద్ధం కారణంగా ఈ ప్రాంతం నిజాం నవాబు పాలనలోకి వచ్చింది. 1799లో నిజాం నవాబు, ఈస్టిండియా పాలకులు కలిసి మరో మారు శ్రీరంగపట్నాన్ని ముట్టడించి టిప్పుసుల్తాన్ ను చంపేశారు. ఈ పరిణామానంతరం సైనిక ఖర్చుల కింద నిజాం నుంచి కడప, బళ్ళారి వంటి ప్రాంతాలతో పాటు కర్నూలు కూడా తిరిగి తీసుకున్నారు.
"https://te.wikipedia.org/wiki/గులాం_రసూల్_ఖాన్" నుండి వెలికితీశారు