గులాం రసూల్ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
== రాజ్యాధికారం ==
గులాం రసూల్ ఖాన్ చివరి కొడుకు కావడం, సంప్రదాయసిద్ధంగా తండ్రి మొదటి కుమారుడికే రాజ్యం సిద్ధించడం వంటి కారణాలతో ఇతనికి అంత తేలికగా రాజ్యం రాలేదు. అలూఫ్ ఖాన్ తన ఆరుగురు కొడుకుల్లో చివరవాడైన గులాంరసూల్‌ఖాన్ మీద ఉన్న ప్రేమ వల్ల తన బదులుగా అతడిని నవాబును చేసేందుకు అంగీకరించమని గవర్నర్ మింటోను ప్రార్థించారు. నవాబు తమకు చేసిన సహాయాలు, అతని విశ్వాసం పరిగణించి ఆ ప్రకారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నేపథ్యంలో గులాం రసూల్‌ఖాన్ కర్నూల్ నవాబు అయ్యారు. మళ్ళీ అతనికి మారుగా కొంతకాలం మునవర్‌ఖాన్, ఆపైన ముజఫర్‌ఖాన్ నవాబులు అయ్యారు. క్రీ.శ.1815లో అలూఫ్‌ఖాన్ మరణించడంతో కంపెనీ ప్రభుత్వాధికారులు ముజఫర్ ఖాన్‌ని తొలగించి మునవర్ ఖాన్‌నే నవాబు చేశారు. 1823 సంవత్సరంలో గులాం రసూల్‌ఖాన్ నవాబు అయ్యారు.
== కంపెనీ పాలనకు వ్యతిరేకంగా కుట్ర ==
[[గులాంరసూల్ ఖాన్]] పరిపాలన కాలంలో [[ఈస్టిండియా]] కంపెనీకి ఆఫ్ఘనిస్థాన్ చక్రవర్తికి యుద్ధం వచ్చింది. ఈ యుద్ధంలో ఆఫ్ఘనిస్తాన్ సుల్తాను విజయం సాధిస్తారని, అలా బలహీనపడివున్న సమయంలోనే ఉపఖండంలో కూడా ఈస్టిండియా కంపెనీపై తిరుగుబాటు చేసి పోరాడితే కంపెనీ పాలన అంతరించి తాము స్వతంత్ర పాలకులమవుతామని కొందరు ముస్లిం పరిపాలకులు భావించారు. వారిలో నిజాం తమ్ముడు, కర్నూలు నవాబు గులాం రసూల్ ఖాన్ కూడా ఉన్నారు. పైగా దేశంలో చాలా ప్రాంతాల్లో విస్తరించిన ఈ కుట్రకు ప్రధాన కేంద్రంగా కర్నూలును ఎంచుకుని ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ రహస్యం చిత్రంగా బయటపడింది. [[1839]] వేసవి కాలంలో హైదరాబాదు నగరంలో ఒక బీద ముస్లిం స్త్రీ మరణించడానికి సిద్ధంగా ఉన్న స్థితిలో ఒక వ్యక్తికి తానొక రహస్యం చెప్పదలిచాననీ, తనకొక పని చేసిపెట్టాలనీ కోరింది. ఆ పెద్దమనిషి అందుకంగీకరించగా ఒక రక్షరేకు(తాయెత్తు) చేతికిచ్చి మూసీనదిలో పారవెయ్యమన్నది. దీనిలో ఏదో రహస్యం వుందని అనుమానించి బ్రిటీష్ వారైన పై అధికారులకు తీసుకువెళ్లి ఇచ్చారు. దాన్ని వారు పరిశీలించి నిజాం నవాబు సోదరుడు కర్నూలు నవాబుకు రాసిన ఉత్తరమనీ, రక్షరేకుల్లో ఉన్న మతపరమైన విషయాల ద్వారా భారీ తిరుగుబాటుకు ప్రయత్నాలు పంపుకుంటున్నారని తెలుసుకున్నారు. ఆపైన కర్నూలు నవాబు వద్దకు వెళ్ళి అతని వద్ద ఉండకూడని భారీ ఆయుధాగారం ఉందన్న అనుమానం మీద సోదా చేశారు. అన్ని విధాలుగానూ, ధైర్యంగా నవాబు సహకరించారు. మొదట ఎంత సోదా చేసినా పెద్దసంఖ్యలోని ఆయుధాలేవీ దొరకలేదు. ఇంగ్లీష్ అధికారులు పట్టువదలక సోదా చేస్తే జనానాలోని మైదానం వద్ద కోట గోడల్లో బోలుగా తయారుచేసి లోపల గొప్ప ఆయుధాగారాన్ని సిద్ధం చేసినట్టు బయటపడింది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/గులాం_రసూల్_ఖాన్" నుండి వెలికితీశారు