గులాం రసూల్ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
నవాబు తలపెట్టిన కుట్ర 1839లో భగ్నమయ్యాకా అతని రాజ్యాన్ని తాము లాక్కుని, రాజకీయ ఖైదీగా తరలించి విచారణ ప్రారంబించారు. రాజకీయఖైదీగా తిరుచునాపల్లి జైలులో ఉండగా ఆయన ఇస్లాం నుంచి క్రైస్తవానికి ఆకర్షితులయ్యారు. అతను క్రమంతప్పకుండా చర్చికి వెళ్తూ క్రైస్తవాభిమాని కావడం సహించలేని ఓ మహమ్మదీయుడు ఫకీరు వేషంలో వచ్చి 1840లో పొడిచి చంపాడు.
== పరిపాలన విధానాలు ==
ఆఖరి నవాబైన రసూం ఖాన్‌కు ముందున్న నవాబుల్లో కొందరు చాలా న్యాయంగా, శాంతినెలకొనేలా పరిపాలించారు. దేశం సుభిక్షంగా ఉండేది. మతపక్షపాతాన్ని చూపకుండా ఈ ప్రాంతంలో విస్తరించిన హిందూపుణ్యక్షేత్రాలకు కూడా ఇనాములిచ్చి పోషించారు<ref name="కథలు గాథలు" />. అయితే ధన విషయంగా మాత్రం వీరు ప్రజలకు చాలా ఇక్కట్లు కలిగించేవారు. కొద్దికాలం పాటు అయితే ఏకంగా గ్రామాధికారులే తమ గ్రామాల్లో పన్నులు నిర్ధారించి తీసుకునే స్థితికి పరిపాలన దిగజారిపోయింది.<br />
=== పుణ్యక్షేత్రాలు ===
కర్నూలు నవాబుల్లో చివరి వాడైన [[గులాం రసూల్ ఖాన్]] మాత్రం ప్రజాకంటకమైన పరిపాలన చేశారు. ఇతని కాలంలోనే కాశీయాత్రలో భాగంగా రసూల్ ఖాన్ నవాబు కింద ఉన్న గ్రామాలు, పట్టణాలు, పుణ్యక్షేత్రాల్లో విడిసిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య అతని పరిపాలన గురించి తన కాశీయాత్రచరిత్రలో భాగంగా సవివరంగా వ్రాసుకున్నారు.<br />
రసూల్ ఖాన్ కాలంలో తన పరిపాలనలో ఉన్న [[అహోబిలం]], [[శ్రీశైలం]] వంటి హిందూ పుణ్యక్షేత్రాల నుంచి భారీగా డబ్బు రాబట్టుకుని కనీస సౌకర్యాల కల్పనలో కూడా శ్రద్ధ వహించేవారు కాదు. శ్రీశైలంలో శివరాత్రి ఉత్సవాలకు వచ్చే సాధారణ భక్తులకు ఒక్కొక్కరికీ రూ.7, గుర్రానికి రూ.5, అభిషేకానికి రూ.3, వాహనోత్సవం చేయిస్తే ఉత్సవపు సెలవులు కాక రూ.43, దర్పణసేవోత్సవానికి రూ.3 ప్రకారం నవాబుకు చెల్లించాల్సివచ్చేది. అహోబిలంలో ఫాల్గుణమాసంలో బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో 400 వరహాల హాశ్శీలు ఆదాయం వస్తూండేదని, దానిని కందనూరి నవాబు తీసుకుని గుడికి చేయాల్సిన సౌకర్యాల గురించి మాత్రం పట్టించుకునేవాడు కాదని వివరించారు. వీటన్నిటికీ పరాకాష్టగా శ్రీశైల మల్లికార్జునుడికి, భ్రమరాంభాదేవికీ ఎవరైనా ఆభరణాలు, వస్త్రాలు సమర్పిస్తే వాటి ఖరీదుకు తగ్గ హాశ్శీలు తీసుకోవడమే కాక కొన్ని రోజులు గడిచాకా వాటిని తాను అపహరిస్తున్నాడన్న విషయం వ్రాసుకున్నారు<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>.
 
Line 18 ⟶ 17:
 
=== ఆర్థిక వ్యవహారాలు ===
కర్నూలు నవాబుల కాలంలో దక్షిణ భారతదేశ రాజకీయాలు కల్లోలితమై ఉండేవి. మొదట మరాఠాలు, ఆపై ఆంగ్లేయులు, ఫ్రెంచివారు, హైదరాలీ తదితరులు తమ అధికార పరిధి విస్తరించేందుకు వివిధ యుద్ధాలను చేశారు. ఈ సమయంలో కర్నూలు నవాబులు నిజాంకు, ఈస్టిండియా కంపెనీకి కట్టవలసిన పేష్కషు కాకుండా యుద్ధ సమయాల్లో ధనాన్నీ, సైన్యాన్నీ అందించి తోడ్పడవలసివచ్చింది. శివాజీ సైన్యాలు, హైదరాలీ సైన్యాలు వచ్చిపడి బాధిస్తూండడంతో అమితమైన ధనవ్యయం జరుగుతూండేది. అంతటి ధనవ్యవయాన్ని సమర్థించుకునేందుకు నవాబులునవాబు ప్రజలను పీడించి రకరకాల పద్ధతుల్లో సొమ్ము రాబట్టుకునేవారు. పన్నుల వసూలులో క్రమపద్ధతి లోపించింది. నవాబులు నిర్దేశించిన పన్నులు గ్రామాధికారులు వసూలుచేసి యిచ్చే స్థితి నుంచి గ్రామాధికారులే తమకు తోచిన పన్నులు వేసి వసూలుచేయడం వరకూ వచ్చింది. గ్రామాధికారులకు గ్రామాలను గుత్తకు యిచ్చి ఇంతకు తక్కువ వసూలుచేయరాదన్న నియమాలు విధించడంతో వారు ఇచ్ఛకు వచ్చిన పన్నులు వేసి, పీడించడం ప్రారంభమైంది. శిస్తువసూలుకు గ్రామస్తులు కాక గ్రామాధికారులే జవాబుదారులైనందువల్ల వారు నిరంకశులై అక్రమాలు చేయడం మొదలుపెట్టారు. పంటలు పండకపోయినా గ్రామాధికారులు పూర్తిస్థాయిలో పన్నువసూళ్ళు చేసుకునేవారు. పంటలు బాగా పండితే నవాబు సైన్యాలు వచ్చిపడి ఆ ధాన్యాన్ని బలవంతంగా ఎత్తుకుపోయేవి. పండితే సైన్యం పెట్టే బాధలు పడలేక నంద్యాల ప్రాంతంలో రైతులు ఏకంగా మూడేళ్ళు వ్యవసాయమే మానుకున్నారంటే పరిస్థితి ఊహించవచ్చు<ref name="కథలు గాథలు">{{cite book|last1=వెంకట శివరావు|first1=దిగవల్లి|title=కథలు-గాథలు (కందనూరు నవాబు రాజరికం)|date=1944|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|pages=127 - 140|edition=1|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=kathalu%20gaathalu%20modat%27i%20bhaagamu&author1=raavu%20digavalli%20vein%27kat%27a%20shiva&subject1=GENERALITIES&year=1944%20&language1=Telugu&pages=168&barcode=2030020024649&author2=&identifier1=&publisher1=digavalli%20vein%27kat%27a%20shiva%20raavu%20&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/740|accessdate=1 December 2014}}</ref>.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/గులాం_రసూల్_ఖాన్" నుండి వెలికితీశారు