గులాం రసూల్ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
=== పుణ్యక్షేత్రాలు ===
కర్నూలు నవాబుల్లో చివరి వాడైన [[గులాం రసూల్ ఖాన్]] ప్రజాకంటకమైన పరిపాలన చేశారు. ఇతని కాలంలోనే కాశీయాత్రలో భాగంగా రసూల్ ఖాన్ నవాబు కింద ఉన్న గ్రామాలు, పట్టణాలు, పుణ్యక్షేత్రాల్లో విడిసిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య అతని పరిపాలన గురించి తన కాశీయాత్రచరిత్రలో భాగంగా సవివరంగా వ్రాసుకున్నారు.<br />
రసూల్ ఖాన్ కాలంలో తన పరిపాలనలో ఉన్న [[అహోబిలం]], [[శ్రీశైలం]] వంటి హిందూ పుణ్యక్షేత్రాల నుంచి భారీగా డబ్బు రాబట్టుకుని కనీస సౌకర్యాల కల్పనలో కూడా శ్రద్ధ వహించేవారు కాదు. శ్రీశైలంలో శివరాత్రి ఉత్సవాలకు వచ్చే సాధారణ భక్తులకు ఒక్కొక్కరికీ రూ.7, గుర్రానికి రూ.5, అభిషేకానికి రూ.3, వాహనోత్సవం చేయిస్తే ఉత్సవపు సెలవులు కాక రూ.43, దర్పణసేవోత్సవానికి రూ.3 ప్రకారం నవాబుకు చెల్లించాల్సివచ్చేది. అహోబిలంలో ఫాల్గుణమాసంలో [[బ్రహ్మోత్సవాలు]] జరిగే రోజుల్లో 400 వరహాల హాశ్శీలు ఆదాయం వస్తూండేదని, దానిని కందనూరి నవాబు తీసుకుని గుడికి చేయాల్సిన సౌకర్యాల గురించి మాత్రం పట్టించుకునేవాడు కాదని వివరించారు. వీటన్నిటికీ పరాకాష్టగా శ్రీశైల మల్లికార్జునుడికి, భ్రమరాంభాదేవికీ ఎవరైనా ఆభరణాలు, వస్త్రాలు సమర్పిస్తే వాటి ఖరీదుకు తగ్గ హాశ్శీలు తీసుకోవడమే కాక కొన్ని రోజులు గడిచాకా వాటిని తాను అపహరిస్తున్నాడన్న విషయం వ్రాసుకున్నారు<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>.
 
=== గ్రామపరిపాలన ===
"https://te.wikipedia.org/wiki/గులాం_రసూల్_ఖాన్" నుండి వెలికితీశారు