అనిల్‌కుమార్ సిన్హా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1956 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''అనిల్‌కుమార్ సిన్హా ''' ఒక భారతీయ పోలీసు అధికారి. 2014 డిసెంబరు 3న సిబిఐ సంచాలకుడుగా నియమితుడై వార్తలలో నిలిచాడు.
==నేపధ్యము==
మానసిక శాస్త్రము (సైకాలజీ)లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన ఏకే సిన్హా, హార్వర్డ్ వర్సిటీ విద్యార్థి. 2013లో సీబీఐ అధికారిగా చేరిన సిన్హా, గతంలో పలు ముఖ్య బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ అదనపు కార్యదర్శిగా, బిహార్ అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ విభాగాల్లో పనిచేశారు. సీబీఐలో శారదా స్కాం సహా పలు ముఖ్య కేసులను పర్యవేక్షించారు. ప్రతిభావంతమైన సేవలకుగాను సిన్హాకు 2000లో పోలీసు పతకం, 2006లో రాష్ట్రపతి పోలీసు పతకం లభించాయి. ఐపీఎస్ అధికారిగా 1979లో చేరిన సిన్హా 18 ఏళ్లు బిహార్‌లోని వివిధ జిల్లాలకు ఎస్పీగా, స్పెషల్ బ్రాంచ్ డీఐజీగా ఉన్నారు. 1998-2005 మధ్య కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లి, ప్రత్యేక రక్షణ దళం (ఎస్పీజీ) డీఐజీగా పనిచేశారు. 2005లో తిరిగి బిహార్ వెళ్లి అదనపు డీజీ హోదాలో పనిచేశారు. 2010లో తిరిగి డిప్యుటేషన్‌పై కేంద్రానికి వచ్చి విజిలెన్స్ కమిషన్ అదనపు కార్యదర్శిగా చేరి 2013 వరకూ కొనసాగారు. 2013 మేలో సీబీఐ స్పెషల్ డెరైక్టర్‌గా చేరారు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}